టాలీవుడ్

‘కల్కి‘ ఊసే ఎత్తని దీపిక పదుకొనె

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. విడుదలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో సినిమా నుంచి ఒక్కొక్కటిగా ప్రచార చిత్రాలను విడుదల చేస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘బుజ్జి‘ పేరుతో విడుదలైన గ్లింప్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘కల్కి‘ సినిమా గురించి ప్రస్తావిస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది తారాగణం గురించి. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, దిశా పటాని వంటి వారు నటిస్తున్నారు. తమిళం నుంచి విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యమయ్యాడు. అయితే.. ‘కల్కి‘ సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమాలో నటించిన నటీనటులు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ‘కల్కి‘ని ప్రమోట్ చేస్తున్నారు. ఒక్క దీపిక పదుకొనె తప్ప.

‘కల్కి‘ మూవీలో ఎంతో ప్రాధాన్యత గల పాత్రలో కనిపించనుందట దీపిక. అయినా.. ‘కల్కి‘ సినిమా గురించి దీపిక సోషల్ మీడియా పేజెస్ లో ఎలాంటి అప్డేట్స్ పోస్ట్ చేయడం లేదు. ఇక.. దీపిక ప్రిగ్నెంట్ అవ్వడంతోనే ఈ మూవీలో ఆమె కనిపించాల్సిన కొంత పోర్షన్ ను తగ్గించారనే ప్రచారమూ ఉంది. అలాగే.. ఈ మూవీలో ఇప్పటికే ప్రభాస్-దిశా పటాని మధ్య ఓ రొమాంటిక్ డ్యూయెట్ చిత్రీకరించారు. కానీ.. ప్రభాస్ – దీపిక మధ్య ఎలాంటి పాటలూ ఉండవని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. ‘కల్కి‘ విషయంలో దీపిక చిన్న చూపు చూస్తుందనే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో జోరందుకున్నాయి.

Telugu70mm

Recent Posts

యు.వి. క్రియేషన్స్ లో శ్రుతి హాసన్

టాలీవుడ్ తో లాంగ్ అసోసియేషన్ ఉన్న కథానాయికల్లో స్టార్ డాటర్ శ్రుతి హాసన్ ఒకరు. ఆరంభంలో ఐరెన్ లెగ్ అనే…

50 mins ago

నెట్‌ఫ్లిక్స్ లో రాజమౌళిపై డాక్యుమెంటరీ

దర్శకధీరుడు రాజమౌళి ఓ ట్రెండ్ సెట్టర్. ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ లో నిలిపిన గ్రేట్ ఫిల్మ్ మేకర్. రాజమౌళి…

1 hour ago

‘పుష్ప 2’ క్లైమాక్స్ కోసం కసరత్తులు

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ జీనియస్ అనగానే ముందుగా గుర్తొచ్చే దర్శకుడు సుకుమార్. ఈ లెక్కల మాస్టర్ తన సినిమాల్లో…

1 hour ago

మహేష్ కి ధీటైన ప్రతినాయకుడు దొరికాడు

ప్రతినాయకుడు ఎంత పవర్‌ఫుల్ గా ఉంటే కథానాయకుడి పాత్ర అంతలా ఎలివేట్ అవుతుంది. ఈ సూత్రం దర్శకధీరుడు రాజమౌళికి బాగా…

1 hour ago

‘కల్కి 2’లో మరో ఇద్దరు అతిథులు

'కల్కి' చిత్రంలో అతిథి నటుల పరంపర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్య తారాగణం ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,…

2 hours ago

Ravi Teja Is Getting Ready To Compete With Puri

Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…

14 hours ago