భోళా ట్రైలర్ కి డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా భోళా శంకర్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. మెహెర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ ఆగష్టు 11న ఇండిపెండెన్స్ సీజన్ స్పెషల్ గా రాబోతోంది. తమిళ్ మూవీ వేదాళం కి ఇది రీమేక్. కీర్తి సురేష్.. చిరంజీవి కి చెల్లిగా.. తమన్నా జోడీగా నటించింది.


ఇప్పటికే వచ్చిన టీజర్ ఫాన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈ నెల 27న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్ తో పాటు విడుదల చేసిన స్టిల్ పదిహేనేళ్ల క్రితం మెగా లుక్ ను తలపిస్తోంది. చేతిలో ఖడ్గం తో చాల అగ్రెస్సివ్ గా కనిపిస్తున్నాడు చిరంజీవి.

ఇప్పటి వరకు సినిమా నుంచి మూడు పాటలు విడుదల చేశారు. కానీ ఏదీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇవి సినిమా కు ఏ మాత్రం బజ్ తేలేకపోయాయి. మరి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో చూడాలి.

Related Posts