ఆయనో సూపర్ స్టార్. టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడు. మొన్నటి వరకూ కామ్ గోయింగ్ అనే అనిపించుకున్నాడు. కానీ తాజాగా చేస్తోన్న సినిమాతో ఆ మూవీ టీమ్ ను ఓ ఆట ఆడుకుంటున్నాడు. మరి ఆ టీం తప్పు ఏమన్నా ఉందా అంటే లేదు. ఇప్పటికే ఆయన కోరినట్టల్లా కథలో అనేక మార్పులు చేశారు. ఒకసారి ఓకే అంటాడు.. తీరా సెట్ లోకి వెళ్లిన తర్వాత మార్చమంటాడు.
మరి అదేదో షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే స్టోరీ సిట్టింగ్ కు వెళ్లొచ్చు కదా అంటే.. అబ్బే అలాంటి గాప్ లు దొరికితే అరక్షణం కూడా సినిమా గురించి ఆలోచించకుండా వొకేషన్స్ కు చెక్కేస్తుంటాడు. ఇక్కడ ఈయనతో పెట్టుకున్న సీన్స్ లో ఉన్న ఆర్టిస్ట్ ల డేట్స్ వెస్ట్ అవుతుంటాయి. మల్లి కావాలంటే కష్టం అవుతుంది.
ఈ స్టార్ గారి నిర్లక్ష్యం వాళ్ళ ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. పైగా సార్ గారికి అందరూ టాప్ టెక్నీషియన్స్ కావాలి. మరి ఇలా అర షెడ్యూల్ కోసారి కథలు మారుస్తూ.. నెలకు రెండు సార్లు టూర్లకు వెళుతూ ఉంటే.. వారికి మాత్రం వేరే సినిమాలు, కమిట్మెంట్ లు ఉండవా .. అందుకే ఈ స్టార్ తీరుతో విసిగిపోయి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు.
ఆ మధ్య హీరోయిన్ వెళ్లిపోవడానికి ఈయనే కారణమంట. నిజంగా సినిమా చేయాలనీ ఉంటే, తనకు ఇంత స్టర్డామ్ ఇచ్చిన ఇండస్ట్రీ పై గౌరవం ఉంటే.. తనకు నచ్చేలా కథ కుదిరే వరకూ దగ్గరుండి చూసుకోవాలి.. లేదా ఇచ్చిన కథలో నటించి అవతలికి వెళ్ళిపోవాలి. ఈ రెండూ కాదు నేను సినిమానే చేయను అనుకుంటే ఆ ముక్క అయినా చెప్పాలి. ఇవేవీ చేయకుండా నిర్మాతల డబ్బులను, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ టైం నూ వేస్ట్ చేస్తే .. సూపర్ స్టార్ అనే పదానికే మచ్చ పడుతుంది.