టాలీవుడ్

భారీ అంచనాలతో రాబోతున్న క్రేజీ సీక్వెల్స్

ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ ఒరవడిని ఫాలో అవుతున్నారు మేకర్స్. అయితే.. ఇప్పటికే ఒక సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన ప్రాజెక్ట్స్ విషయంలో.. వాటి సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఎక్కువగా ప్రచారం లేకుండానే ఆ సినిమాలకు వస్తోన్న హైప్ అంతా ఇంతా కాదు. మరి.. అలాంటి క్రేజీ సీక్వెల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఫస్ట్ పార్ట్ హిట్టైతే.. రెండో పార్ట్ అంతకుమించి హిట్టైన సందర్భాలను ‘బాహుబలి 2, కె.జి.ఎఫ్ 2’ విషయంలో చూశాము. ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలోనూ అదే జరుగుతుందనే అంచనాలున్నాయి. అందుకే.. ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ కంటే రెండు, మూడు రెట్లు భారీతనంతో తీర్చిదిద్దుతున్నాడట క్రియేటివ్ జీనియస్ సుకుమార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చింది ‘పుష్ప’ క్యారెక్టర్. అలాగే ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని.. దశాబ్దాల తెలుగు హీరోల కలను కూడా నెరవేర్చాడు బన్నీ. ‘పుష్ప 2’ ఈ ఏడాది డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను మళ్లీ రెబెలియస్ అవతార్ లో చూపించి.. రెబెల్ స్టార్ గా మార్చింది ‘సలార్’. కల్ట్ సెన్సేషనల్ హిట్టైన ‘సలార్’కి సెకండ్ పార్ట్ ఉంది. 2025లోనే ఈ సినిమాని తీసుకుచ్చే దిశగా సన్నాహాలు చేస్తోంది టీమ్. ‘సలార్ 1.. సీజ్ ఫైర్’కి మించిన రీతిలో ‘సలార్’ సెకండ్ పార్ట్ ఉండబోతుందనేది ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యే విషయమే. అసలు కథంతగా సెకండ్ పార్ట్ లోనే ఉంది.

‘సలార్ 2‘తో పాటు.. ప్రభాస్ కిట్టీలో ఉన్న చేరిన మరో సీక్వెల్ ‘కల్కి 2‘. ‘కల్కి‘ కల్ట్ హిట్ అవ్వడంతో.. సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రెబెల్ ఫ్యాన్స్. పైగా.. ప్రభాస్ కి సీక్వెల్ లోనే ఎక్కువ స్క్రీన్ టైమ్ దొరుకుతుంది. అలాగే.. విశ్వనటుడు కమల్ హాసన్ నట విశ్వరూపం కూడా సెకండ్ పార్ట్ లో చూసే అవకాశం ఎక్కువ. ఇప్పటికే ‘కల్కి‘ పార్ట్ 2.. 60 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందట. త్వరలో.. మిగతా భాగాన్ని పూర్తిచేసి 2026 సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే మరో సీక్వెల్ ‘జై హనుమాన్’. బ్లాక్ బస్టర్ హిట్ ‘హనుమాన్‘కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందనుంది. ‘జై హనుమాన్‘ మూవీలో హనుమాన్, శ్రీరాముడు పాత్రల్లో నటించే నటుల గురించి భారీ స్థాయిలోనే ప్రచారం జరిగింది. మొదటి పార్ట్ విషయంలో బడ్జెట్ సమస్యలున్నాయి. అయితే.. ఇప్పుడు ‘హనుమాన్’ సీక్వెల్ విషయంలో అలాంటి పట్టింపులు ఉండే అవకాశం లేదు. వందల కోట్ల బడ్జెట్ తో ‘జై హనుమాన్‘ని తీర్చిదిద్దనున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. త్వరలోనే ‘జై హనుమాన్‘ పట్టాలెక్కనుంది.

Telugu70mm

Recent Posts

Divyabharathi

2 hours ago

Kajal Aggarwal

2 hours ago

Vijay Mallya episode in ‘Bharateeyudu 2’

After 'Kalki', 'Bharateeyudu 2' is another South movie that is going to make noise at…

4 hours ago