బిగ్ బాస్ టాస్క్ లో వణికిపోతున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ లో టాస్క్ లకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వినోదంతో పాటు అప్పుడప్పుడు భయపెట్టే టాస్క్ లు కూడా కనిపిస్తుంటాయి. వీటిలో కంటెస్టెంట్స్ ఎక్స్ పీరియన్స్ రియల్ గానే ఉంటుంది. అదేం నటన కాదు అని అందరికీ తెలుసు. అలా తెలిసేలానే టాస్క్ ను డిజైన్ చేస్తారు.

ఇక తాజాగా వదిలిన ప్రోమోలోని టాస్క్ చూస్తే .. అదో హాంటెడ్ హౌస్ లాంటి థీమ్. కంప్లీట్ గా రెడ్ డార్క్ గా ఉంది. అందులోని సెట్ ప్రాపర్టీస్ కూడా భయపెట్టేలా కనిపిస్తున్నాయి. మొదటగా ఆ రూమ్ లోని బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ శోభ వెళ్లింది. బయట ఫైర్ బ్రాండ్ లా ఉన్నా.. హౌస్ లోకి వెళ్లగానే అమ్మడు వణికిపోయింది. ” బిగ్ బాస్ ఏదన్న రెస్పాండ్ అవ్వండి బిగ్ బాస్ ప్లీజ్.. భయమేస్తుంది.. ” అని వేడుకోవడం చూస్తే నవ్వొస్తుంది. తర్వాత ధాట్ల దామిని వెళ్లింది. తను రూమ్ అంతా చూస్తూ.. ” ఫస్ట్ ఆఫ్‌ ఆల్ రూమ్ అంత కంఫర్ట్ గా లేదు.. ” అనగానే బేస్ వాయిస్ తో బిగ్ బాస్ తేజా.. ఒకసారి దగ్గరకు రా అని పిలవగానే దామిని భయపడిపోయింది.. ఆ రూమ్ లోనే వీరితో పాటు రతిక కూడా ఉంది.


ఇక తేజను బిగ్ బాస్ ఒకసారి దగ్గరకు రా అని భయపడేలా పిలుస్తాడు. దానికి హే నేను రాను అంటూ తేజ ఏదో ధైర్యంగా ఉన్నట్టు నటిస్తాడు.. అలాగే రతిక అనే అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చి ఇద్దరి మధ్య గొడవలు పెట్టండని ఏదో ఇచ్చారంటా అని తేజ చెబుతుండగా.. ‘ తేజా ఒక ఇద్దరి పేర్లు చెప్పండి’ అంటూ బిగ్ బాస్ మళ్లీఅడుగుతాడు. అప్పుడు ‘ ఆ అమ్మాయికి ఒక ఇద్దరి మధ్య ఎవరూ మన ప్రిన్సూ.. అంటూ తేజ చెబుతుండగా.. కారణాలు తర్వాత అని కౌంటర్ వేశాడు బిగ్ బాస్. ‘తెలుగు షోలో ఆ మేడమ్ గారిని ఎందుకు పెట్టారో మీ కారణాలు మీకుంటాయ్.. అని తేజ ఏదో చెబుతుండగా.. ‘భాష అనేది నామినేషన్ కు కారణం కాదు” అంటాడు బిగ్ బాస్.

దానికి తప్పే నేను ఒప్పుకుంటా అంటాడు తేజ. కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఈ ఇంట్లో కుదరదు అని బిగ్ బాస్ తేల్చివేస్తాడు.. ‘ఇంత క్లారిటీతో చెప్పినా కూడా మీరు అలా అంటారేంటీ బిగ్ బాస్ అని తేజ అంటే.. తేజా.. మీరు ఇక్కడే పడుకోవచ్చు అంటాడు బిగ్ బాస్. వెంటనే థ్యాంక్యూ బిగ్ బాస్ అని పారిపోతాడు తేజ…సో.. ఈ టాస్క్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ అందరికీ ఏదో ఒక ఫిటింగ్ పెట్టే ప్రయత్నం చేసేలా ఉన్నారు. దానికి ముందే వారిని ఈ థీమ్ తో భయపెట్టే ప్రయత్నం కనిపిస్తోంది. మరి ఈ టాస్క్ చివరికి ఏమవుతుందో చూడాలి.

Related Posts