రోలెక్స్ లా ఎంట్రీ ఇచ్చిన హరాల్డ్ దాస్

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో అర్జున్.కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గానూ నటిస్తున్నాడు. ముఖ్యంగా విలన్ చేస్తున్నప్పుడు ఆయన ఎంచుకునే సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న లియో లో ఓ విలన్ గా నటించాడు.

ఇవాళ అతని బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే విక్రమ్ సినిమాలో రోలెక్స్ ఎంట్రీ గుర్తొస్తుంది. చుట్టూ పదుల సంఖ్యలో విలన్స్ ఉన్నారు. వారి మధ్యలోకి వచ్చిన అర్జున్ అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి చేతులు నరికేస్తాడు. ఇది చూడగానే అతను ఓ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు అని అర్థం అవుతుంది.


లియో లో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ నటించాడు. అతని పాత్ర పేరు ఆంటోనీ దాస్. అతని తమ్ముడుగా అర్జున్ కనిపించబోతున్నాడు. ఈ పాత్ర పేరు హరాల్డ్ దాస్. ఈ ఆంటోనీ, హరాల్డ్ ల అరాచకాలను తిప్పి కొట్టే యోధుడుగా విజయ్ నటించాడన్నమాట. విజయ్ కి జోడీగా త్రిష నటించిన ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. ఇక అర్జున్ వీడియో చూస్తే లోకేష్ మరోసారి తనదైన మ్యాజిక్ చేయబోతున్నాడు అనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related Posts