టాలీవుడ్

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సినిమా

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఉత్సాహంతో కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు స్పీడు పెంచుతున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తన 156వ సినిమాని పూర్తిచేస్తున్న చిరు.. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘భగవంత్ కేసరి’తో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి.. చిరు కోసం ఇప్పటికే ఓ లైన్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఆ స్టోరీ లైన్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోలో ప్రాజెక్ట్ దాదాపు ఖరారయ్యిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇక.. చిరు-అనిల్ రావిపూడి క్రేజీ కాంబోని నిర్మిస్తుంది మరెవరో కాదు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇప్పటికే దిల్ రాజు కాంపౌండ్ లో అనిల్ రావిపూడి పలు సూపర్ హిట్స్ అందించాడు. పైగా.. మెగాస్టార్ తో సినిమాకోసం దిల్ రాజు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. ఈనేపథ్యంలో.. చిరంజీవి-అనిల్ కాంబోని సెట్ చేయడానికి దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. త్వరలోనే.. ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.

Telugu 70mm

Recent Posts

Catherine Tresa

2 hours ago

ఫన్ అండ్ ఎమోషనల్ గా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్

విభిన్నమైన పాత్రలతో క్యారెక్టర్ యాక్టర్ గా ఫుల్ బిజీగా సాగుతోన్న అజయ్ ఘోష్ హీరోగా నటించిన చిత్రం 'మ్యూజిక్ షాప్…

7 hours ago

‘మనమే’ ట్రైలర్.. శర్వానంద్ కలర్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా

హీరో శర్వానంద్ నటించిన రొమాంటిక్ డ్రామా 'మనమే'. శర్వానంద్ కెరీర్ లో 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్‌సే…

7 hours ago

‘ఓజీ’ వాయిదా వెనుక అసలు కారణం ఏంటి

రీ ఎంట్రీలో ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదల చేస్తోన్న పవన్.. ఈ సంవత్సరం మాత్రం రెండు సినిమాలను ప్రేక్షకుల…

7 hours ago

ఈ వారం సినిమాల హీరోలంతా అనాధలే..!

కొన్ని వారాల గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ కళ కళ లాడుతోంది. ఈరోజు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.…

1 day ago

‘గం గం గణేశా’ రివ్యూ

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులుసినిమాటోగ్రఫి: ఆదిత్య జవ్వాదిసంగీతం: చైతన్…

1 day ago