చంద్రముఖి 2 కొత్త రిలీజ్ డేట్

అనుకున్నట్టే అయింది. చంద్రముఖి2 పోస్ట్ పోన అనగానే అందరూ వీళ్లు కూడా సెప్టెంబర్ 28నే వస్తారు అని భావించారు. అలాగే అయింది. పోస్ట్ పోన్ అని చెప్పిన సాయంత్రానికే కొత్త డేట్ చెప్పారు. అంటే వీళ్లు కావాలనే ఆ డేట్ కు వెళ్లారు అనడంలో తప్పేం లేదు. నిజానికి వీళ్లు మొదట అనుకున్న సెప్టెంబర్ 15 అనేది చాలా సేఫ్ డేట్. ఎందుకంటే ఆ రోజు రావాలనుకున్న స్కంద వాయిదా పడింది. పోటీ కేవలం విశాల్ తోనే ఉంది. విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాపై ఇప్పటి వరకూ ఎలాంటి అంచనాలూ లేవు. అస్సలే మాత్రం బజ్ లేదు అనేది నిజం.

ఒకవేళ తమిళ్ లో ఉన్నా.. మార్క్ ఆంటోనీ, చంద్రముఖి2 రెండూ భిన్నమైన జానర్స్ లో వస్తోన్న చిత్రాలు. పైగా ఎవరి ఫ్యాన్ బేస్ వారికి ఉంది. అయినా చంద్రముఖి2దే పై చేయి అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదలవుతుంది. పి వాసు, కంగనా రనౌత్ లాంటి క్రేజీ థింగ్స్ ఉన్నాయి. అందువల్ల చంద్రముఖి2 మేకర్స్ తీసుకున్న నిర్ణయం తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా ఏమంత హర్షించదగ్గది కాదు అనే కమెంట్స్ వస్తున్నాయి.


ఇక 17యేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖికి సీక్వెల్ గా పి వాసు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సారి చంద్రముఖిగా కంగనా నటిస్తోంది. అప్పుడు ఇది రీమేక్. ఇప్పుడు సీక్వెల్. మరి ఈ సారి ఎలాంటి విజయం అందుకుంటుందో కానీ.. ఇలా పోస్ట్ పోన్ అని అలా కొత్త డేట్ అనౌన్స్ చేయడం చూస్తుంటే వీరు జవాన్ సినిమా కలెక్షన్స్ ను చూసే వెనక్కి తగ్గారు అనేది తేలిపోతుంది. మరి ఒక సినిమా కలెక్షన్స్ ను చూసి భయపడితే తర్వాత మరో సినిమా వస్తే అప్పుడూ పోస్ట్ పోన్ చేసుకుంటారా..?

Related Posts