ఇలయ దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా విడుదలకు నలభై రోజుల ముందే ఓ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఇండియా నుంచి ఏ సినిమా సాధించని రికార్డ్ ఇది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై ఇండియా మొత్తం అంచనాలున్నాయి. లోకేష్ చివరగా విక్రమ్ తో 450 కోట్లు కొల్లగొట్టాడు. ఇటు విజయ్ కి ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. షూటింగ్ స్టార్ట్ చేయగానే విడుదల చేసిన టీజర్ కే ఓ రేంజ్ అప్లాజ్ వచ్చింది. ఎలా చూసినా ఈ మూవీ తమిళనాడు నుంచి రికార్డులు పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని విశ్లేషకులంతా అంచనా వేస్తున్నారు.
ఇక తాజా రికార్డ్ చూస్తే యూకే లో కేవలం 24 గంటల్లోనే 10వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన24 గంటల్లోనే ఇన్ని టికెట్స్ అమ్ముడు పోయిన సినిమా ఇండియా నుంచి లియోనే ఫస్ట్ కావడం విశేషం. ఇక అహింస ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు ఈ చిత్రాన్ని యూకేలో విడుదల చేస్తున్నారు. మొత్తం యూకేలో 120 లొకేషన్స్ లో లియో విడుదలవుతోంది. విడుదలకు ఇంకా 42 రోజుల ముందే ఈ రేంజ్ టికెట్స్ అయిపోయాయి అంటే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే యూకే బాక్సాఫీస్ కూడా షేక్ అవుతుందని వేరే చెప్పక్కర్లేదేమో. పైగా ఈ మూవీకి ప్రస్తుతం కంట్రీ మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ మారిన అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. మాస్ మూవీస్ అంటే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బ్యాక్ బోన్ గా నిలుస్తున్నాడు అనిరుధ్. ఇంక అతను విజయ్ కి వీరాభిమాని. అంటే మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
లియోలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది సంజయ్ దత్, అర్జున్ సర్జా విలన్లుగా నటించారు. ఇతర పాత్రల్లో గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్ తదితరులు నటిస్తున్నారు.