2005లో విడుదలైన చంద్రముఖి సంచలన విజయం సాధించింది. రజినీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి పి వాసు దర్శకుడు. ఈ సినిమా కూడా 1993లో మళయాలంలో వచ్చిన మణిచిత్ర తాళు అనే మూవీకి రీమేక్. ఈ రీమేక్ ను వాసు రజినీ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చి మంచి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. అందుకే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ చూసిన చాలామంది సెకండ్ షో తర్వాత ఇంటికి వెళ్లాలంటేనే వణికిపోయారు. ఆ రేంజ్ లో భయపెట్టారు. ఆ సినిమాకు సీక్వెల్ గా నాగవల్లి అనే మరో మూవీ తీశాడు వాసు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ కన్నడలో మాత్రం హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు చంద్రముఖి2 అంటూ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సారి హారర్ కామెడీ ఎంటర్టైనర్స్ కు కేరాఫ్ గా మారిన రాఘవ లారెన్స్ ను తీసుకున్నాడు. అతని సరసన భయపెట్టేందుకు చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ను సెలెక్ట్ చేసుకున్నారు.
చంద్రముఖి2 షూటింగ్ అయిపోయింది. సెప్టెంబర్ 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా నుంచి ఒక్కో లుక్ వదులుతున్నారు. రీసెంట్ గా లారెన్స్ స్టిల్ వచ్చింది. ఇప్పుడు కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తోంది కంగనా. తన లుక్ లో ఓ రాయల్టీ ఉంది. ఈ మూవీలో తనే చంద్రముఖి అని చెప్పకనే చెప్పారు. కాబట్టి సినిమాలో ఆ పాత్రను ఎలా రివీల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది.
ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రాబోతోన్న చంద్రముఖి2 కోసం ఒక్కో భాష నుంచి ఒక్కో సంగీత దర్శకుడితో ఆర్ఆర్ చేయించాడు దర్శకుడు. తెలుగులో కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉందని ఈ సారి భయపెట్టడం కాదు.. వణికించడం ఖాయం అంటూ కితాబునిచ్చాడు కీరవాణి. మొత్తంగా కంగనా ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ పెరిగింది అనేది నిజం.
ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…
Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…
Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…
There is a huge demand for the audio rights of movies starring star heroes. There…
Post-Covid there has been no significant celebration in the Telugu film industry. It should be…
Beauty Avika Gor, who was introduced on the screen as a child bride. At the…