టాలీవుడ్

ఒకేరోజు రెండు సినిమాలతో చాందిని చౌదరి

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిలు కరువైపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. మేమున్నామంటూ అడపాదడపా కొంతమంది తెలుగమ్మాయిలు.. కథానాయికలుగా అలరిస్తూనే ఉన్నారు. ఈకోవలోనే.. హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తుంది చాందిని చౌదరి.

తొలుత పలు షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన చాందిని.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, బ్రహ్మోత్సవం, శమంతకమణి’ వంటి చిత్రాలతో కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, మను’ వంటి సినిమాలు చేసినా.. ‘కలర్ ఫోటో‘ మాత్రం కథానాయికగా మంచి విజయాన్నందించింది. ‘కలర్ ఫోటో‘ తర్వాత చాందిని వరుస సినిమాలతో బిజీ అవుతూనే వచ్చింది. ఈ లిస్టులో ‘సమ్మతమే, గామి‘ వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి.

లేటెస్ట్ గా రేపు ఒకేరోజే రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది చాందిని. ఆ చిత్రాలే ‘మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్‘. ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘లో టైటిల్ పాత్రధారి అయిన అజయ్ ఘోష్ కి దిశా నిర్దేశం చేసే అమ్మాయిగా ప్రాధాన్యత గల పాత్రలో నటించింది చాందిని. ‘యేవమ్‘ మూవీలో పోలీసాఫీసర్ పాత్రలో తన పవర్ చూపించడానికి సిద్ధమవుతోంది.

Telugu 70mm

Recent Posts

థీమ్ ఆఫ్ ‘కల్కి’ వచ్చేసింది..!

'కల్కి' సినిమా థీమ్ ఏంటి? అనే దాని గురించి సాగే ఓ పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'అధర్మాన్ని అనిచెయ్యగా..…

11 hours ago

ఈసారి స్టైలిష్ గా వస్తోన్న సేనాపతి

వెండితెరపై సందేశాత్మక చిత్రాలను అత్యధ్భుతంగా తీర్చిదిద్దడంలో దిట్ట శంకర్. తాను చెప్పాలనుకున్న మెస్సేజ్ ను కమర్షియల్ గా భారీ కాన్వాస్…

11 hours ago

‘బడ్డీ‘ ట్రైలర్.. టెడ్డీ కోసం రంగంలోకి అల్లు శిరీష్

'ఊర్వశివో రాక్షసివో' తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం 'బడ్డీ'. అల్లు శిరీష్ కి జోడీగా గాయత్రి భరద్వాజ్ నటించింది.…

14 hours ago

కొత్త సినిమా ప్రకటించిన నివేదా థామస్

మలయాళం నుంచి వచ్చి తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో నివేదా థామస్ ఒకరు. నాని ‘జెంటిల్ మన్‘తో టాలీవుడ్…

14 hours ago

ఆగస్టు 15న రాబోతున్న ‘ఆయ్‘

ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా రావాల్సిన ‘పుష్ప 2‘ వాయిదా పడడంతో.. ఆ తేదీకి రష్ పెరుగుతోంది.…

15 hours ago

Bandhavi Sridhar

16 hours ago