బెదురులంక 2012కు ఎదురులేదా

ట్రైయాంగిల్ ఫైట్ అన్నప్పుడు విన్నర్ ఎవరా అని అంతా చూస్తారు. ఈ వారం వచ్చిన మూడు సినిమాల్లో( నిజానికి నాలుగు) విజేత ఎవరు అని ప్రేక్షకులు కూడా అనుకున్నారు. 24న మళయాల డబ్బింగ్ సినిమా కింగ్ ఆఫ్‌ కొత్త విడుదలైంది. దుల్కర్ సాల్మన్ నటించిన ఈ చిత్రం మనవారికి పెద్దగా నచ్చలేదు. ఇంకా చెబితే విపరీతమైన ల్యాగ్ తో పరమ బోరింగ్ సినిమా అనిపించుకుంది.

ఇక ఈ శుక్రవారం విడుదలైన చిత్రాలు వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేసిన గాండీవధారి అర్జున, క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన బెదురులంక2012. ఈ రెండు సినిమాల్లో గాండీవధారికి ఆడియన్స్ నుంచి థంబ్స్ డౌన్ అనే టాక్ వచ్చింది. ప్రవీణ్‌ సత్తారు ఈ మూవీ కథ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడని అర్థం అవుతుంది. గార్బేజ్ వల్ల వచ్చే సమస్యల గురించి చెప్పాడు. బట్ ఆ చెత్త కాన్సెప్ట్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు.


ఇక పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినా బెదురులంక బెటర్ గా ఉందనే టాక్ తెచ్చుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం అద్భుతం అని అనకపోయినా.. వచ్చిన వాటిలో ఇదే చాలా చాలా బెటర్ అంటున్నారు. ముఖ్యంగా కార్తికేయ, నేహాశెట్టి కాంబినేషన్ తో పాటు విలేజ్ నేపథ్యంలో అల్లుకున్న కామెడీ సీన్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి.

చాలా చోట్ల హ్యాపీగా నవ్వుకునే సీన్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఉంటే అంతకు మించి ఇంకేం ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందుకే బెదురులంక 2012 కే ఆడియన్స్ ఓటు వేస్తున్నారు. కథా పరంగా సింపుల్ గా ఉండటం.. 2012 లో యుగాంతం అవుతుందన్న పుకార్ల నేపథ్యంలో అల్లుకున్న పాయింట్స్ ఆకట్టుకోవడం.. చివర్లో ఓ చిన్న సందేశం మిక్స్ చేసి దర్శకుడు రాసుకున్న డైలాగ్స్ అన్నీ మెప్పించడంతో బెదురులంకను ఫ్రైడే విన్నర్ గా చెబుతున్నారు.

అయితే మౌత్ టాక్ మరింత పెరగాల్సి ఉంది. అప్పుడే కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. దీంతో పాటు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ప్రమోషన్స్ కూడా పెంచుకుంటే కమర్షియల్ గా ఇంకాస్త బెటర్ రిజల్ట్ చూస్తారు అనేది విశ్లేషకుల అంచనా.

Related Posts