పుష్ప మహేష్ బాబు చేసి ఉంటే ఇంత అప్లాజ్ వచ్చేదా

ఒక హీరో కాదనుకున్న కథలతో మరో హీరో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఎన్నో చూశారు. మొదట ఇమేజ్ కోసం కథలను కాదంటారు. ఎవరో ఒకరు ఇమేజ్ లను దాటి ఆ కథలను చేస్తారు.. హిట్ కొడతారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ తెచ్చిన పుష్ప సినిమా మొదట మహేష్‌ బాబు వద్దకే వెళ్లింది. అతనే ఈ సినిమాలో నటించాలి.

అంతకు ముందు సుకుమార్ – మహేష్ కాంబోలో వచ్చిన ఒన్ నేనొక్కడినే ఫ్లాప్ అయినా క్లాసిక్ అనే ఫ్యాన్స్ ఉన్నారు. బట్ సినిమా మరీ క్లాస్ గా కనిపిస్తుంది. పైగా కమర్షియల్ గా ఫ్లాప్ కాబట్టి మరో మంచి మాస్ మూవీతో మహేష్‌ కు హిట్ ఇవ్వాలనుకున్నాడు సుకుమార్. అందుకే ఈ కథను ముందు మహేష్‌ కు చెప్పాడు. మహేష్ కూడా ఓకే చెప్పాడు. కొన్నాళ్లు ఇద్దరి మధ్య డిస్కషన్స్ నడిచాయి.

ఇప్పుడు గుంటూరు కారం విషయంలో ఎలాగైతే సాగదీతలు కనిపిస్తున్నాయో.. అప్పుడు పుష్ప విషయంలోనూ అదే జరిగింది. చాలాకాలం పాటు ఎదురుచూసిన సుకుమార్ కు నో చెప్పాడు మహేష్‌. మహేష్ కు కథ నచ్చింది. కానీ ఆ గెటప్ తో పాటు స్లాంగ్ విషయంలోనే అభ్యంతరాలున్నాయని అప్పుడు వినిపించింది. ఆ రెండూ లేకపోతే పుష్పలో ఇంకే కొత్తదనమూ కనిపించేది కాదు. అందుకే సుకుమార్ కూడా వెనక్కి తగ్గలేదు.

వెళ్లి అల్లు అర్జున్ ను ఒప్పించాడు. అప్పటికే తనతో ఆర్య, ఆర్య2 చిత్రాలు చేసిన సుకుమార్ రేంజ్ ఏంటో తెలుసు కాబట్టే అల్లు అర్జున్ వెంటనే ఎస్ చెప్పాడు. కట్ చేస్తే ఈ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేశారు. ఆపై ఒక్కో పాటతో సుకుమార్ రంగస్థలం మూవీ స్ట్రాటజీతో తన సినిమా ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉండేలా చేసుకున్నాడు.

ఈ ప్రమోషన్స్ తో పాటు కంటెంట్ కూడా కొత్తగా ఉండటం.. తన హీరో మేనరిజం.. “కూలోడుగా కాదు.. పార్టనర్” గా ఎదగాలనుకున్న ఆ హీరోయిజం జనాలకు నచ్చింది. అందుకే ఈ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ప్రపంచంలో ఎంతోమంది సెలబ్రిటీస్ బన్నీ మేనరిజంస్ ను ఇమిటేట్ చేశాడు. అతని ఇమేజ్ ను దాటి చేసిన ఈ ప్రయత్నమే ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమకు మొదటి ఉత్తమ నటుడుగా అతన్ని చరిత్రలో నిలబెట్టింది.


ఈ కథను రిజెక్ట్ చేసినప్పుడు మహేష్‌ బాబు పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కానీ నిజానికి ఈ మూవీ మహేష్‌ బాబు చేసి ఉంటే.. ఇంత అప్లాజ్ వచ్చేదా అనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా రాదు అనే చెప్పాలి. మహేష్‌ సుకుమారుడు. అల్లు అర్జున్ అంత హార్డ్ వర్క్ చేసి ఉండేవాడు కాదు. అంతెందుకు మహర్షి సినిమాలో తను పొలంలోకి దిగే సన్నివేశం ఉంటుంది కదా.. ఆ పొలం నీళ్లన్నీ మినరల్ వాటర్ తో నింపితేనే దిగుతా అని చెప్పిన స్టార్ హీరో మహేష్‌ బాబు.

మరి అలాంటి వాడు ఇంత హార్డ్ చేస్తాడంటే ఎలా నమ్ముతాం. ఒకవేళ ఈ సినిమా అతను చేసి ఉంటే ఖచ్చితంగా ఇంత మాస్ గా ఉండేది కాదు. మహేష్‌ వాయిస్ లో చిత్తూరు స్లాంగ్ పుత్తూరు కట్లతో నిండిపోయేది. మహేష్ సింపుల్ గా ఉండే సినిమాలను ఇష్టపడతాడు. తమిళ్ లో అజిత్ లా కష్టపడని ఎలివేషన్స్ కోరుకుంటాడు. తను ఫైట్ చేయకపోయినా చేసినట్టుగా కనిపించే ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఎలివేషన్స్ తో కెమెరా నిండిపోవాలని చూస్తాడు.

అంచేత.. పుష్ప మహేష్‌ బాబు చేసి ఉంటే అసలు ముందు నుంచీ ఇంత హైప్ వచ్చేది కాదు. హిట్ అయితే అవ్వొచ్చు కానీ.. ఈ రేంజ్ లో నిలబడేది కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చంటూ ఆయన అభిమానులు కూడా ఈ సినిమా చూసిన తర్వాత చెప్పుకున్నారు.. ఇప్పుడు బన్నీకి నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత గుర్తు చేసుకుంటున్నారు.

Related Posts