‘ గామి ‘ ఇప్పుడు చేయమంటే చేయలేను : విశ్వక్‌సేన్‌

విశ్వక్‌ సేన్ మొదట సైన్ చేసిన మూవీ ఆరేళ్ల తర్వాత ఆవిష్కృతం కాబోతుంది. “గామి” టైటిల్‌తోనే అద్భుతమైన రెస్పాన్స్‌ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్‌తో మరింత బజ్‌ క్రియేట్ అయ్యింది. విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో కార్తీక్ శబరీష్ నిరమిస్తున్న ఈ మూవీ మార్చి 8 న రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మీడియాతో ముచ్చటించారు.


దర్శకుడు విద్యాధర్ నేను చేసిన ‘వెళ్లిపోమాకే’ చూసి సంప్రదించారు. అప్పటికి ‘ఈ నగరానికి ఏమైయింది’ రిలీజ్ కాలేదు. తను కథ చాలా పెద్ద కాన్వాస్ లో కథరాసుకున్నాడు. తను ఆ కథని తీయగలడనే నమ్మకంతో ప్రాజెక్ట్ లోకి వెళ్లాను. ఆ సినిమాకి ఐదేళ్ళు పడుతుందని నాకు ముందే తెలుసన్నారు విశ్వక్‌సేన్.
ఇప్పుడున్న ఇమేజ్‌ కు తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేయలేదు.. అలా చేస్తే కథ చెడిపోతుందన్నారు విశ్వక్‌.


గమ్యాన్ని పాట ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పిక్ అప్ అయ్యింది. శంకర్ మహదేవన్ గారు పాడిన పాటని శ్రీశైలంలో విడుదల చేస్తున్నాం. అది బావుంటుంది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఈ సినిమాలో ఏమి ఉండవో క్లియర్ గా చెప్పాను. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలు చాలా వున్నాయన్నారు.
విద్యాధర్ షూటింగ్ ముందు స్క్రిప్ట్ అంతా చదవాలని చెప్పాడు. చదవాను. చాలా పెద్ద స్క్రిప్ట్. చదువుతున్నప్పుడే అసలు దిన్ని ఎలా తీయగలమనే భయం వేసేది. ఈ సినిమా కోసం దర్శకుడు ఓ మూడేళ్ళు ముందుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాడు. తన ఆఫీస్ అంతా ప్రిపరేషన్ వుంటుంది. దాదాపు తొమ్మిదేళ్ళు ఈ సినిమాతోనే వున్నాడన్నారు.


కుంభమేళాలో అయితే కొన్ని లక్షల మంది అఘోరాలు వుంటారు. వారిలో కలసిపోయి వుండేవాడిని. నా స్టయిల్ లో ఎక్స్ ఫ్లోర్ చేసుకుంటూ వెళ్లాను. నిజంగా నేను అఘోరా అనుకోని చాలా మంది దానాలు చేశారు. ఈ సినిమా ప్రతి రోజు ఒక సవాలే. మైనస్ 30 డిగ్రీల్లో షూట్ చేశాం. కాళ్ళు చేతులు గడ్డలు కట్టేసేవి. నిజంగా అవి తచుకుంటే ఇంత రిస్క్ చేశామా అనిపిస్తుంది. ఇప్పుడు చేయమంటే మాత్రం చేయనన్నారు.
ప్రస్తుతం తెలుగు రిలీజ్ పై ద్రుష్టి పెట్టాం. సినిమాని పీసిఎక్స్ ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నాం. మన దగ్గర నాలుగు స్క్రీన్ వున్నాయి. ఒక తెలుగు సినిమా ఈ ఫార్మెట్ లో రావడం ఫస్ట్ టైం అన్నారు. రాబోయే సినిమాల గురించి చెప్తూ..


హిమాలయాల నుంచి గోదావరికి వెళ్లి మళ్ళీ మలక్ పేట్ కి వచ్చేస్తా అన్నారు నవ్వుతూ. లైలా మేలో మొదలౌతుంది. సుధాకర్ చెరుకూరి గారి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నానన్నారు విశ్వక్‌సేన్.

Related Posts