టాలీవుడ్

టాలీవుడ్ క్రష్ శ్రీలీలకు బర్త్ డే విషెస్

ఓవర్ నైట్ స్టార్.. యంగ్ సెన్సేషన్.. టాలీవుడ్ క్రష్.. ఇలాంటి విశేషణాలన్నీ హీరోయిన్ శ్రీలీలకు సరిగ్గా సరిపోతాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ అమ్మడి పేరు మారు మ్రోగుతోంది. ఎటు చూసినా ఈ బ్యూటీ గురించే టాక్ నడుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ వరకూ అందరికీ శ్రీలీలే కావాలి. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ బిజీ అవుతోన్న శ్రీలీల బర్త్ డే ఈరోజు (జూన్ 14).

కొంతమంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటారు. అయితే.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల విషయంలో రెండూ జరిగాయి. ఒకవైపు డాక్టర్ చదువుతూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సంతతికి చెందిన శ్రీలీల పెరిగిందంతా బెంగళూరులో. 2019లో కన్నడ చిత్రం ‘కిస్’తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీతోనే కన్నడ కుర్రకారును ఉర్రూతలూగించిన శ్రీలీల.. ఈ సినిమాతోనే మన దర్శకేంద్రుడు దృష్టిలో పడింది. రాఘవేంద్రరావు ఎవర్ గ్రీన్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘పెళ్లి సందడి’ పేరుతోనే వచ్చిన ‘పెళ్లి సందడి’తో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

రాఘవేంద్రరావు నిర్మాణ పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ చిత్రం శ్రీలీలకు మంచి పేరు తీసుకొచ్చింది. ‘పెళ్లి సందడి’ సూపర్ హిట్ కాకపోయినా ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా.. కీరవాణి స్వరపరిచిన పాటలకు శ్రీలీల వేసిన స్టెప్పులకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ పాటలో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను కొల్లగొట్టాయి.

‘పెళ్లి సందడి’ తెలుగులో చేసిన ‘ధమాకా’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో మాస్ మహారాజకి జోడీగా హై ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకుంటోంది శ్రీలీల. ముఖ్యంగా.. ‘పల్సర్ బైక్’ సాంగ్ లో శ్రీలీల వేసిన స్టెప్స్ స్పీడును మరో హీరోయిన్ అందుకోవడం కష్టమే అనే ప్రశంసలు కూడా పొందింది.

‘ధమాకా’ తర్వాత వరుసగా ‘స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. వీటిలో ‘భగవంత్ కేసరి’ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే.. ఏడాది కాలంలోనే అరడజను సినిమాలను విడుదల చేసిన శ్రీలీల.. ఆ తర్వాత స్పీడు తగ్గించింది. ఇప్పుడు సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం శ్రీలీల కిట్టీలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు.. రవితేజ 75వ చిత్రం కూడా ఉంది. అలాగే.. తమిళంలో అజిత్ సరసన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లోనూ నటించే ఛాన్స్ అందుకుంది. మరోవైపు.. బాలీవుడ్ లోనూ అడుగులు వేసేందుకు సంసిద్ధమవుతోంది శ్రీలీల. మొత్తంమీద.. మునుముందు మరిన్ని భారీ విజయాలందుకోవాలని ఆశిస్తూ.. శ్రీలీలకు బర్త్ డే విషెస్ తెలుపుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Telugu 70mm

Recent Posts

Pragya Jaiswal

2 hours ago

Honey Rose

2 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

2 hours ago

Nabha Natesh

3 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

3 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

3 hours ago