ప్రెజెంట్ టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరికీ తమన్ మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. మీడియం రేంజ్ హీరోలకు మెగా మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజికల్ సెన్సేషన్. కేవలం తెలుగులోనే కాకుండా.. పర భాషలలోనూ సత్తా చాటుతోన్న సంగీత సంచలనం తమన్ పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 16).
తల్లిదండ్రుల నుంచి సంగీతాభిరుచి
తమన్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాడు. తమన్ తాత ఘంటసాల బాలరామయ్య.. ప్రముఖ నిర్మాత-దర్శకుడు. ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించిన ‘సీతారామజననం’ సినిమాతోనే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక.. తమన్ తండ్రి ఘంటసాల శివ కుమార్.. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద ఏడు వందల చిత్రాలకు డ్రమ్మర్ గా పనిచేశారు. తమన్ తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని. అలా.. తమన్ కి తల్లిదండ్రుల నుంచి సంగీతాభిరుచి అలవడింది.
తొలుత నటుడిగా చిత్ర ప్రవేశం
రాజ్-కోటి, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఆర్.పి. పట్నాయక్, దేవిశ్రీప్రసాద్ వంటి పలువురు సంగీత దర్శకుల వద్ద పనిచేసిన తమన్.. మణిశర్మ వద్ద ఎక్కువకాలం కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేశాడు. అయితే.. తమన్ తొలుత సంగీత దర్శకుడిగా కంటే.. నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశాడు. శంకర్ దర్శకత్వం వహించిన ‘బాయ్స్’ సినిమాలో ఒన్ ఆఫ్ ద హీరోస్ గా నటించి మెప్పించాడు తమన్.
కిక్కిచ్చే సక్సెస్ అందించిన ‘కిక్’
2008లో ‘మళ్లీ మళ్లీ’ సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమైన తమన్ కి.. రవితేజ నటించిన ‘కిక్’ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి విజయాన్నందించింది. ఇక.. ఆ తర్వాత తమన్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా.. ‘బృందావనం’, ‘మిరపకాయ్’, ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’, ‘నాయక్’, ‘బాద్ షా’, ‘బలుపు’ వంటి మ్యూజికల్ హిట్స్ అందుకున్నాడు.
ఒకవైపు చిన్న చిత్రాలు.. మరోవైపు పెద్ద సినిమాలు..
ఒకవైపు అగ్ర కథానాయకులతో మ్యూజికల్ హిట్స్ ఇస్తూనే.. మరోవైపు స్మాల్, మీడియం రేంజ్ హీరోలను కవర్ చేస్తున్నాడు ఈ మ్యూజికల్ సెన్సేషన్. తెలుగులో ఉన్న దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు చేసిన క్రెడిట్ తమన్ సొంతం చేసుకున్నాడు. ఇక.. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. తమిళంలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన తమన్.. కన్నడ, మలయాళం, హిందీ భాషలలోనూ తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.
తమన్ కిట్టీలో క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం తెలుగులో ఉన్న సంగీత దర్శకులలో తమన్ దే అగ్ర స్థానం అని ఒప్పుకోవాల్సిందే. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ ప్లేసులోకి దూసుకెళ్లాడు. ఈ ఏడాది ‘వారసుడు, వీరసింహారెడ్డి, బ్రో, స్కంద, భగవంత్ కేసరి’ వంటి సినిమాలను ఆడియన్స్ ముందు నిలిపిన తమన్ కిట్టీలో ‘గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, ఓజీ, రవితేజ-మలినేని ప్రాజెక్ట్’ వంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి.
The film 'Indian' came out with the story of how an Indian who fought heroically…
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న డివోషనల్ మూవీ 'కన్నప్ప'. అసలు రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడైన…
Today (May 9) the team released special glimpses from the movie 'Tandel' on the occasion…
స్వాతంత్ర్యోద్యమంలో వీరోచితంగా పోరాడిన ఓ భారతీయుడు.. స్వాతంత్ర్యానంతరం జరుగుతోన్న అవినీతిపై ఎలా ఉక్కు పాదం మోపాడన్న కథతో 'ఇండియన్' చిత్రం…
Today (May 9) is rowdy star Vijay Deverakonda's birthday. On this occasion, the makers have…
Natural Beauty Sai Pallavi does movies selectively without accepting all the offers. She suddenly gave…