Latest

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు బర్త్‌డే విషెస్

నందమూరి బాలకృష్ణ.. నటసార్వభౌముడికి వారసుడిగా వచ్చిన హీరో… తొలి చిత్రం ‘తాతమ్మ కల’తోనే తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు. పంచె కడితే పల్లెటూరి సింహంలా ఉంటాడు. మీసం తిప్పితే అచ్చంగా సింహాన్నే తలపిస్తాడు. తొడగొడితే.. రికార్డులన్నీ కనుమరుగైపోతాయ్. సమరసింహమైనా.. నరసింహమైనా.. పాత్రలో లీనమైతే ఉగ్రనరసింహుడైపోతాడు. ‘సింహా’.. ఆయన చేసిన సినిమా.. కానీ సింహం.. అభిమానులు ఆయనకు పెట్టుకున్న పేరు. జానపదాల నుంచి పౌరాణికాల వరకూ.. ఫిక్షన్ నుంచి నుంచి ఫ్యాక్షన్ వరకూ.. చేయగల ఒన్ అండ్ ఓన్లీ లెజెండ్ బాలకృష్ణ బర్త్ డే ఇవాళ (జూన్ 10).

తొలినాళ్లలో కేవలం ఎన్టీఆర్ కొడుకుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య తర్వాత తనదైన ప్రతిభ, కృషితో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అగ్ర హీరోగా ఎదిగాడు. మాస్ హీరోగా అశేష తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. బాలయ్య లాగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన హీరో ఆయన సమకాలీకుల్లో ఇంకెవరూ లేరు. జనరేషన్స్ మారుతున్నా .. జనం గుండెల్లో చెరగని స్థానం బాలయ్యది. కరెక్ట్ కథ పడితే.. సిల్వర్ స్క్రీన్ నే డిక్టేట్ చేయగల అఖండుడు బాలయ్య.

ఓ వైపు చదువుకుంటూనే తండ్రితో పాటు ఆయన నటించిన సినిమాల్లో కనిపించేవారు. అలా బాలకృష్ణలోని స్పార్క్ ను తొలిసారిగా చూపించిన సినిమా ‘దానవీరశూరకర్ణ’. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలకృష్ణ అభిమన్యుడిగా మంచి నటన చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పద్మవ్యూహం సన్నివేశంలో మహాభారత అభిమన్యుడు కూడా ఇలాగే ఉంటాడనేలా మెప్పించి ప్రశంసలందుకున్నాడు.

అలాగే ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ కూడా బాలయ్యను పరిపూర్ణ నటుడిగా మార్చే క్రమంలో వచ్చిందే. అక్బర్ తనయుడిగా అనార్కలి ప్రియుడిగా బాలయ్య నటన ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. మొత్తంగా టీనేజ్ లో ఉండగానే దాదాపు 11 సినిమాల వరకూ తండ్రి నీడలోనే నటించాడు.. అయినా సరే ఆయనతో పాటుగా తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు.

సోలో హీరోగా బాలకృష్ణ నటించిన తొలి సినిమా 1984లో వచ్చిన ‘సాహసమే జీవితం’. ఈ సినిమా తర్వాత ‘డిస్కో కింగ్’, కె విశ్వనాథ్ డైరెక్షన్ లో ‘జననీ జన్మభూమీశ్చ’ సినిమాలు చేశాడు. అయితే బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ ను తెచ్చిన సినిమా అదే యేడాది విడులైన ‘మంగమ్మగారి మనవడు’. పల్లెటూరి పంచెకట్టులో అద్భుతమైన నటన చూపించిన ఈ సినిమాతోనే బాలయ్యకూ పర్సనల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అలాగే హీరోగా ఎంట్రీ ఇచ్చిన యేడాదిలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా 1984లో సోలో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బాలయ్య ఆరేళ్లలోనే అగ్రహీరోగా ఎదిగాడు.

ఇక తొంభైల్లో బాలయ్య కెరీర్ లో ఓ వెలుగు వెలిగిందనే చెప్పాలి. మరోవైపు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి తన తరం హీరోలూ హవా చేస్తున్న తరుణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఈ దశకంలో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒక రకంగా 90వ దశకంలో బాలయ్య ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అనదగ్గ సినిమాలు చాలానే చేశాడు. తన యాభైవ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ నుంచి మొదలై ‘ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్ పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం’ వరకూ అప్రతిహతంగా అద్భుత విజయాలతో కొనసాగింది ఆయన కెరీర్.

బాలయ్య నుంచి ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్ధలయ్యేలా వచ్చిన బ్లాక్ బస్ట్ర ‘సమరసింహారెడ్డి’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య సీమ పౌరుషానికే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. ‘సమర సింహారెడ్డి’ తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాడు. కొన్ని రెగ్యులర్ కమర్షయల్ సినిమాలు చేశాడు. కానీ సమరసింహారెడ్డి లాంటి సినిమా చూసిన తర్వాత బాలయ్యను మళ్లీ ఇలా చూడ్డం ఆడియన్స్ కు నచ్చలేదు. అందుకే మళ్లీ సీమకే షిప్ట్ అయిపోయాడు. ఈ సారి మరో బ్లాక్ బస్టర్. తన రికార్డులను తన సినిమాలే బద్దలు కొట్టిన ఆ సినిమా ‘నరసింహనాయుడు’. ఈ సినిమాతో తొలిసారిగా నటుడుగా నంది అవార్డ్ కూడా అందుకున్నాడు బాలయ్య.

బాలకృష్ణ అంటే దర్శకుల హీరో. ఒక్కసారి కథ నచ్చి ఒకే చెప్పాడా ఇక ఆ విషయంలో ఎప్పుడూ వేలుపెట్టడు. సరైన కథ పడితే బాలయ్య విశ్వరూపం చూపిస్తాడు. అలాగని ఇతర పాత్రల్లో అలా చేయడని కాదు.. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే ఆయన శైలి. ఆ శైలిని అద్భుతంగా పట్టుకుని బాలయ్యలోని నట సింహాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘సింహా’.. బాలయ్య కెరీర్ లో ఖచ్చితంగా రావాల్సిన టైమ్ లో వచ్చింది. ‘సింహా’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చి.. మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాదు.. రెండో నంది అవార్డ్ నూ అందుకున్నాడీ సినిమాతో.

‘సింహా’ తర్వాత కొన్ని ఫ్లాపులతో విజయం గాడి తప్పుతుందేమో అనుకుంటోన్న టైమ్ లో మరోసారి బోయపాటితో ‘లెజెండ్’ చేసి మళ్లీ రికార్డులు సరిచేశాడు. వైవిధ్యమైన చిత్రాలు కూడా తగ్గించుకుని పూర్తి స్థాయి మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకే ఓకే చెప్పాడు. కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా బాలయ్య యాట్యిట్యూడ్ లో ఏ మార్పూ రాకపోవడమే ఆయన ఈ వయసులో కూడా అంత జాలీగా ఉండటానికి కారణం.

దర్శకుడు క్రిష్ తో కలిసి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇది తన వందో సినిమా. బాలయ్య నటనకు భళా అన్నారంతా. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండడమే నటసింహం స్టైల్.

ఇక.. ఆమధ్య హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమైన బాలయ్యను మరోసారి బాక్సాఫీస్ లెజెండ్ గా నిలబెట్టిన చిత్రం ‘అఖండ’. ‘సింహా, లెజెండ్’ తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

‘అఖండ’ తర్వాత ‘వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి’ సినిమాలతో మరో రెండు బ్లాక్‌బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలతో మరోసారి తన రౌద్ర రసాన్ని సిల్వర్ స్క్రీన్ పై పీక్స్ లో చూపించాడు నటసింహం.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈరోజు నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ అందజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు బర్త్‌డే విషెస్

Telugu 70mm

Recent Posts

The Shooting Of ‘Double Ismart’ Has Been Completed.

Energetic star Ram and dashing director Puri Jagannath are teaming up for the film 'Double…

5 mins ago

షూటింగ్ పూర్తిచేసుకున్న ‘డబుల్ ఇస్మార్ట్’

ఎనర్జటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఫక్తు మాస్ ఎంటర్…

8 mins ago

Happy Birthday Nandamuri Kalyan Ram

Kalyan Ram is a self-made star who has made himself a hero even though he…

14 mins ago

‘Bhagwant Kesari’Is A Bumper Hit In Bollywood Too

Even though many of our Tollywood heroes do not make direct films in Bollywood, they…

26 mins ago

A friendship that has remained intact for decades

Rare are the protagonists who have achieved unbroken stardom for decades. Collection King Mohan Babu…

31 mins ago

‘Mr Bachchan’ in romantic mode

Mass Maharaja Ravi Teja is now looking forward to a good win. He is gearing…

36 mins ago