టాలీవుడ్

గ్రేట్ ఫిల్మ్ మేకర్ మణిరత్నం పుట్టినరోజు

ఆయన టేకింగ్ స్టైల్ కి ఫిదా అవ్వని ఫిల్మ్ మేకర్స్ ఉండరు. ఆయన చిత్రంలో నటించాలనుకునే నటీనటులకు ఏమాత్రం కొదవ ఉండదు. ప్రెజెంట్ సౌత్ ఇండియాస్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ లో ప్రథమ స్థానంలో ఉన్న ఆయనే క్రియేటివ్ జీనియస్ మణిరత్నం. ఈరోజు (జూన్ 2) మణిరత్నం పుట్టినరోజు.

సౌతిండియా సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ లో.. ఇప్పటికీ ఫుల్ యాక్టివ్ గా ఉన్న దర్శకుడెవరంటే మణిరత్నం పేరే ముందుగా చెప్పాలి. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన మణిరత్నం కెరీర్ మొదలయ్యింది ఫ్లాప్ మూవీస్ తోనే. మణిరత్నం దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలు పరాజయాలు పాలయ్యాయి. అలా.. నాలుగు చిత్రాల తర్వాత 1986లో ‘మౌనరాగం’ మూవీతో తొలి విజయాన్నందుకున్నాడు ఈ క్రియేటివ్ జీనియస్.

1986లో ‘మౌనరాగం’ మొదలుకొని.. ‘నాయకుడు, ఘర్షణ, గీతాంజలి, అంజలి, దళపతి, రోజా’ వరకూ ఒక సినిమాకి మించి మరొకటి విజయాలు సాధించాయి. రివార్డులే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న చిత్రాలుగా ఈ సినిమాలు నిలిచాయి. ఇక.. దర్శకత్వంలో మణిరత్నం టేకింగ్ కు ఫిదా అవ్వని ఫిల్మ్ మేకర్స్ లేరు. ఎంతోమంది ఔత్సాహిక దర్శకులు.. మణిరత్నం ను ప్రేరణగా తీసుకునే చిత్ర రంగంలోకి ప్రవేశించారు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు మణిరత్నం. పాన్ ఇండియా లెవెల్ లో హిస్టారికల్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తీసుకొచ్చాడు మణిరత్నం. వెయ్యేళ్ల క్రితం చోళ సామ్రాజ్యాన్ని ఈ సినిమాతో అద్భుతంగా ఆవిష్కరించాడనే ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్’. ‘విక్రమ్’ విజయంతో కమల్ హాసన్.. ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్ తో మణిరత్నం మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దాంతో.. ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి చేస్తున్న ‘థగ్ లైఫ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కమల్ కి జోడీగా త్రిష నటిస్తుంది.

ఇతర కీలక పాత్రల్లో శింబు వంటి వారు నటిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ‘థగ్ లైఫ్’ సినిమాని నిర్మిస్తున్నాయి. ‘థగ్ లైఫ్’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఆకాంక్షిస్తూ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కు బర్త్ డే విషెస్ తెలుపుతోంది ‘తెలుగు 70 ఎమ్.ఎమ్.’

Telugu 70mm

Recent Posts

ఉత్తర అమెరికాలో కలెక్షన్ల కింగ్ ప్రభాస్

తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…

5 hours ago

ముహూర్తానికి సిద్ధమైన వెంకటేష్-అనిల్ రావిపూడి చిత్రం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…

5 hours ago

భారీ అంచనాలతో రాబోతున్న క్రేజీ సీక్వెల్స్

ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…

5 hours ago

జూలైలో వస్తోన్న విజయ్ ఆంటోని ‘తుఫాన్‘

మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…

5 hours ago

‘బచ్చల మల్లి‘గా మాస్ లుక్ లో అల్లరి నరేష్

రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…

5 hours ago

‘Kalki’ Is Sure To Hit A Thousand Crores

In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…

24 hours ago