HomeMoviesటాలీవుడ్తంత్ర మూవీ ట్రైలర్ లాంచ్

తంత్ర మూవీ ట్రైలర్ లాంచ్

-

అనన్య నాగళ్ల, దినేష్‌ రఘుముద్రి జంటగా.. శ్రీనివాస్‌ గోపిశెట్టి డైరెక్షన్‌లో.. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషనల్‌ వీడియోస్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ తో హ్యూజ్‌ బజ్‌ క్రియేట్ అయ్యింది. రీసెంట్‌ గా ట్రైలర్‌ లాంచ్‌ చేసారు చిత్ర యూనిట్.తాంత్రిక విధానంలో డెప్త్ సబ్జెక్ట్‌ను ఎలివేట్ చేసేలా.. ఈ సినిమా ట్రైలర్‌ కట్ చేసారు. ఫుల్లీ ఇంటెన్స్ సీన్స్‌తో థ్రిల్లర్ లవర్స్‌ను ఎంగేజ్‌ చేస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని కలిగించింది.వకీల్‌సాబ్‌ అనన్య కు బదులు..మల్లేశం అనన్యకు బదులు ఇకనుంచి తంత్ర అనన్య అంటారు ఈ సినిమాతో పేరొస్తుందన్నారు అనన్య నాగళ్ల. ఇందులో హారర్ తో పాటు రోమాన్స్ సెంటిమెంట్ అన్నీ వుంటాయి. మార్చి 15న తప్పకుండా సినిమా చూడండి” అని కోరారు అనన్య.


మన డిజిటల్ యుగం పేరుతో కొన్ని మూలాల్ని మరిచిపోతున్నాం.. తాంత్రిక విధానాన్ని నెగిటివ్‌ కోణంలో చూపిస్తున్నారు. తంత్రం అనేది ఒక పూజా విధానం.. మనలో క్షుద్ర ఆలోచన వచ్చేసరికి అది క్షుద్ర పూజలనుకుంటారు అన్నారు దర్శకుడు గోపిశెట్టి. అనన్య గారు పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. తన పాత్రలో చాలా డెప్త్ వుంటుంది. ధనుష్ రఘుముద్రి శ్రీహరి గారి తమ్ముడు కొడుకు. ఆయన నట వారసత్వాన్ని ధనుష్ కొనసాగిస్తారని బావిస్తున్నానన్నారు.
ఈ చిత్రం మార్చి 15 న గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతుంది.

ఇవీ చదవండి

English News