టాలీవుడ్

భీమా సక్సెస్‌మీట్

మ్యాచో హీరో గోపీచంద్, ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ మెయిన్‌లీడ్‌గా ఎ. హర్ష డైరెక్షన్‌లో కెకె రాధామోహన్ నిర్మించిన మూవీ ‘భీమా’ . మహాశివరాత్రి సందర్భంగా రిలీజయిన ఈ సినిమా.. యాక్షన్‌ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సక్సెస్‌ మీట్ నిర్వహించింది.
మా చిత్రాన్ని గొప్పగా ఆదరించి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కథని నా దగ్గరకి తీసుకొచ్చి, సినిమాని అద్భుతంగా తీసి, ప్రేక్షకుల చేత ప్రశంశలు అందుకునేలా చేసిన దర్శకుడు హర్షకి ధన్యవాదాలు. సినిమాకి కావాల్సినదంత సమకూర్చి ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించి ఇంత మంచి అవుట్ పుట్ తెచ్చిన నిర్మాతలు రాధమోహన్, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో సినిమా చేసి చాలా కాలమైయింది. ఇందులో సెకండ్ హాఫ్ లో ఆయన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్వామీ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారన్నారు హీరో గోపీచంద్.


ఇంత మంచి ప్రాజెక్ట్ ని నా వద్దకు తీసుకొచ్చిన మా సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఇంతమంచి ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఇచ్చిన గోపీగారికి, హర్ష గారికి ధన్యవాదాలు. అజ్జు మంచి డైలాగ్స్ రాశాడు. ఆర్ట్ డైరెక్టర్ రమణ లంక సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డీవోపీ స్వామీ అద్భతమైన విజువల్స్ ఇచ్చారు. ప్రేక్షకులు విజువల్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారి పాత్ర అందరినీ అలరిస్తుంది. రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారన్నారు ప్రొడ్యూసర్‌ కెకె రాధామోహన్.
భీమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పంధన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ప్రేక్షకుల కేరింతలు చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మా అందరి టీం వర్క్. నిర్మాతలు శ్రీధర్, రాధమోహన్ గారికి ధన్యవాదాలు. ఎంతో గొప్ప ప్రోత్సహించి అద్భుతంగా పెర్ఫార్ చేసిన గోపీచంద్ గారికి ధన్యవాదాలు. భీమా, రామాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను నమ్మిన నరేష్ గారికి ధన్యవాదాలు అన్నారు డైరెక్టర్ ఎ.హర్ష

N RENUKA

Recent Posts

‘ప్రతినిధి 2‘ సినిమా రివ్యూ

నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, తనికెళ్ల…

55 mins ago

ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిన ‘మాయా వన్’ టీజర్

సందీప్ కిషన్ హిట్ మూవీస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ జెడ్' ఒకటి. తమిళంలో సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన 'మాయవన్' సినిమాకి…

5 hours ago

ఆస్కార్ విజేతల రచన, స్వరకల్పనలో ‘రాయన్’ సాంగ్

విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం 'రాయన్'. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ…

5 hours ago

‘ఫలక్‌నుమ దాస్’ డేట్ కే రానున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల 'గామి'తో డీసెంట్…

5 hours ago

‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ 'దేవర'. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న 'దేవర' ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది…

5 hours ago