భీమా’ రిలీజ్‌ శివుని ఆజ్ఞే : దర్శకుడు ఎ. హర్ష

గోపీచంద్‌, మాళవిక శర్మ, ప్రియాభవానీ శంకర్‌ మెయిన్‌లీడ్‌ తో ఎ. హర్ష డైరెక్షన్‌లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించిన మూవీ ‘భీమా’ . పరశురామ క్షేత్రంలో రాక్షసులను అంతమొందించే బ్రహ్మరాక్షసుడిగా గోపీచంద్‌ చేసిన పోలీస్‌ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్, ట్రైలర్‌ తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మార్చి 8 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు డైరెక్టర్‌ ఎ. హర్ష.


నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. ఇప్పటివరకూ అన్నీ కన్నడ సినిమాలే చేశాను. రాధామోహన్ గారి నిర్మాణంలో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు వారి బ్యానర్ లోనే భీమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా వుందన్నారు హర్ష.
గోపీచంద్ గారికి కథ చెప్పడంతో నచ్చి.. చిన్న చిన్న మార్పులు చెప్పారు. దాంతో 8 నెలల తర్వాత భీమా కథను స్క్రీన్‌ ప్లే తో సహా నేరేట్ చేయడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ ప్లే తో సాగే కథ ఇదన్నారు. భీమా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా వుంటుంది. అందరికీ అర్ధమౌతుంది. ఎంటర్ టైన్, ఎలివేషన్, ఎమోషన్ తో భీమా మంచి కమర్షియల్ సినిమాగా అలరిస్తుంది. సోషల్ మెసేజ్ కూడా వుంది. భీమా క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. భీమా క్యారెక్టర్ ని అందరూ ఇష్టపడతారన్నారు.


గోపీచంద్ గారు వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా మంచి పెర్ఫార్మార్. ఆయన సినిమాలన్నీ చూశాను. తనకి యూనిక్ బాడీ లాంగ్వేజ్ వుంది. భీమా పాత్ర ఆయనకే అద్భుతంగా నప్పుతుంది. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం వున్న మనిషి. చాలా పాజిటివ్ గా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారన్నారు.
ఒక సినిమాకి డీవోపీ చాలా కీలకం. దర్శకుడి విజన్ తెరపై చూపించేది తనే. ఈ సినిమా డీవోపీ స్వామీతో నాకు 2012 నుంచి అనుబంధం వుంది. నా ప్రతి సినిమా తనే చేస్తాడు. నాకు ఒక కో డైరెక్టర్ లా వుంటారు. స్క్రిప్ట్ లో కూడా కూర్చుంటాడు. మా మధ్య ఆ అనుబంధం వుంది. ఇక రవి బస్రూర్ సినిమాలకి రాక మునుపు నాకు తెలుసన్నారు. అలా ఆయన ప్రాజెక్ట్‌లోకొచ్చారన్నారు.


లేదండీ. అఖండకి భీమాకి సంబంధం లేదు. అఘోరాలని యాంబియన్స్ కోసం చూపించాం తప్పితే వారు సినిమాలో కీలకం కాదన్నారు. రాధమోహన్ గారు చాలా పాషన్ వున్న నిర్మాత. సినిమాని అండర్ స్టాండ్ చేసుకునే నిర్మాత. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. అద్భుతమైన క్యాలిటీతో సినిమాని నిర్మించారన్నారు. మహాశివరాత్రికి రావాలని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోలేదు. ఈ సినిమా ఆరంభం, ముగింపు శివునితో వుంటుంది. హీరో ఎద్దుపై వస్తారు. ఇది కూడా ప్లాన్ చేయలేదు. హీరో మొదటి డైలాగ్ కూడా శివుని మీదవుంటుంది. ఇదంతా శివుని ఆజ్ఞ అని భావిస్తున్నాను.అలాగే శివరాత్రికి రిలీజ్‌ కావడం కూడా శివుని ఆజ్ఞే అన్నారు దర్శకుడు ఎ. హర్ష.

Related Posts