భైరవద్వీపం మళ్లీ క్యాన్సిల్

ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా పెరిగింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలను మళ్లీ ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మార్చి విడుదల చేస్తున్నారు. బట్ అందరికీ ఆదరణ వస్తుందా అంటే లేదు అనే చెప్పాలి. నాగార్జున మన్మథుడుకు ఆశించినంత బజ్ రాలేదు.

రీ రిలీజ్ లో కూడా ఏమంత ఇంపాక్ట్ కనిపించలేదు. ఇక ఇవాళ(బుధవారం) నందమూరి బాలకృష్ణ నటించిన భైరవద్వీపం చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. బట్ షోస్ పడలేదు. అప్పటికే థియేటర్స్ కు చేరుకున్న అభిమానులకు థియేటర్స్ వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు.

కారణాలేంటా అని ఆరాలు తీస్తుండగా.. తామే టెక్నీకల్ ఇష్యూస్ వల్ల విడుదల చేయడం లేదు అని రీ రిలీజ్ ప్లాన్ చేసిన క్లాప్స్ వాళ్లు. వాళ్లు చెప్పిన రీజన్ ను బట్టి.. సినిమాలో కొన్ని సీన్స్ 4కే టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ కాలేదట. దీంతో క్వాలిటీ పూర్ గా కనిపిస్తుందట. కొన్ని సీన్స్ క్వాలిటీతో.. మరికొన్ని పూర్ గా ఉంటే చూసేవారికి పూర్తి స్థాయిలో వినోదం అందదు. అందుకే విడుదలను వాయిదా వేస్తున్నాం అని ప్రకటించారు. వాస్తవంగా కొన్ని పాత సినిమాలకు ఈ సమస్య ఉంది. అదే ఈ చిత్రానికీ తలెత్తిందనుకోవచ్చు.


అయితే మరికొందరు మాత్రం ఈ మూవీకి ఆశించినంత బజ్ మాత్రమే కాదు.. అభిమానులు కూడా అస్సలే మాత్రం ఆసక్తి చూపించలేదు. అందుకే టెక్నికల్ ఇష్యూస్ పేరుతో ఆపేశారు అంటున్నారు. నిజానికి ఈ మూవీని ఈ నెల 5నే విడుదల చేస్తాం అన్నారు. అలా చూసుకుంటే అప్పటికే టెక్నికల్ గా అప్డేట్ అయి ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పటికే క్లియర్ అయి ఉండాలి. ఇప్పుడే ప్రాబ్లమ్ అంటున్నారు అంటే అసలు సమస్యేంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.


భైరవద్వీపం కంటే ముందే బాలకృష్ణ బ్లాక్ బస్టర్ నరసింహ నాయుడును రీ రిలీజ్ చేశారు. దానికే ఆడియన్స్ నుంచి పెద్దగా స్పందన లేదు. ఇంక భైరవద్వీపానికి ఉంటుందా అనేది ఇంకొందరి వెర్షన్.

Related Posts