పొలిమెర 2 వచ్చేస్తోంది

ఏ అంచనాలూ లేకుండా వచ్చే కొన్ని సినిమాలు అనూహ్య విజయాలు సాధిస్తుంటాయి. స్టార్ కాస్ట్ లేకున్నా.. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్ తోమెప్పించే సినిమాలు ఎప్పుడో కానీ రావు. అలా వచ్చిన చిత్రమే మా ఊరి పొలిమేర.

కాకపోతే ముందే చెప్పినట్టు స్టార్ కాస్ట్ లేని కారణంగా ఇది థియేటర్స్ లో విడుదల కాలేదు. ఓటిటిలో వచ్చింది. అయినా ఓటిటి ద్వారానే తిరుగులేని మౌత్ టాక్ తో ఊహించిన దానికంటే ఎక్కువమంది చూశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేతబడి నేపథ్యంలో సాగిన ఈ కథలో సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో ఆశ్చర్యపరిచాడు.

డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శ్రీను తదితరులు నటించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయింది. ఈ మూవీకి తిరుగులేని ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. ఖచ్చితంగా నెక్ట్స్ ఏం జరిగింది అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అందుకే ఈ మూవీకి సీక్వెల్ కావాలని ఆడియన్స్ నుంచి కూడా డిమాండ్ వచ్చిందంటే దర్శకుడి ప్రతిభను అంచనా వేయొచ్చు.


అందరూ కోరుకున్నట్టుగానే మా ఊరి పొలిమేరకు సీక్వెల్ వస్తోందని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. నవంబర్ 2న ఈ సారి థియేటర్స్ లో కలుసుకుందాం అని చెబుతూ ప్రకటించారు. కవిత ఎట్లా బతికచ్చిందో తెలియాలంటే నవంబర్ 2న గ