టైటిల్ తో ఆసక్తి పెంచిన బెల్లంకొండ

మాస్ హీరోగా ఎస్టాబ్లిష్‌ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఆ తరహా కథలతోనే ఆకట్టుకుంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఇప్పటి వరకూ అతను ఎక్స్ పెక్ట్ చేస్తోన్న సాలిడ్ హిట్స్ మాత్రం రాలేదు. అయినా మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

మరోవైపు రాక్షసుడు మూవీతో బ్లాక్ బస్టర్ పడినా దాన్ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. రీసెంట్ గా ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేసి లాస్ అయ్యాడు. ఈ రీమేక్ అక్కడి ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అయినా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు వంటి మూవీస్ తో ఆద్భుతంగా ఆకట్టుకుని భీమ్లా నాయక్ తో మంచి విజయాన్ని అందుకున్న సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్.


” టైసన్ నాయుడు”.. ఇదీ బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా టైటిల్. టైసన్ అనగానే అందరికీ మైక్ టైసన్ గుర్తొస్తాడు. ఆ వెంటనే నాయుడు అనడం చూస్తోంటే యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా గ్యారెంటీ అనిపిస్తోంది. దాదాపు ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్ తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూను అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. అయితే ఈ మధ్య వచ్చిన గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేస్తూ.. మరో రెండు ప్రాజెక్ట్స్ ను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాడీ యంగ్ హీరో. మరి ఈ టైసన్ నాయుడుకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related Posts