మెగాస్టార్ తర్వాత బాలయ్యే

టాలీవుడ్ లో ఒకప్పుడు ఎవరికి ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి స్టార్డమ్ నిర్ణయించేవారు. ఇప్పుడూ అది ఉన్నా.. ఒక్కో బ్లాక్ బస్టర్ తో ఒక్కో రెమ్యూనరేషన్ యాడ్ అవుతుంది. ఈ రెమ్యూనేషన్‌ ను బట్టి రేంజ్ ను డిసైడ్ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీ అయినా.. ఆడియన్స్ అయినా వర్తిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ఫోర్ గా చెప్పుకునే నిన్నటి తరం సూపర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ ల రెమ్యూనరేషన్ చూసుకుంటే చాలా గ్యాప్ తర్వాత బాలయ్య.. చిరంజీవి తర్వాతి స్థానానికి వచ్చాడు.

నిజానికి బాలయ్య నిర్మాతల ఫ్రెండ్లీ. వారిని ఇబ్బంది పెట్టడం.. ఇంత ఇవ్వాల్సిందే అనడం ఎప్పుడూ లేదు. తన మార్కెట్ ను బట్టి నిర్మాతలు పెంచితే తప్ప తనుగా ఎప్పుడూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదు. అఫ్‌ కోర్స్ అటు చిరంజీవితో పాటు మిగతా హీరోలూ అంతే. కాకపోతే వీరిలో ఈ విషయంలో బాలయ్య కాస్త బెస్ట్. మెగాస్టార్ ఇప్పటికి కూడా బాక్సాఫీస్ కు తన స్టామినా చూపిస్తున్నాడు.

ఆయనకు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50-60 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ ఉంది. మెగాస్టార్ తర్వాత స్థానంలో ఎప్పుడూ ఉండే బాలకృష్ణ రెమ్యూనరేషన్ ను సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ విషయంలో కాస్త వెనకే ఉన్నాడు. మొన్నటి వరకూ బాలయ్య రెమ్యూనరేషన్ 15 కోట్ల వరకూ ఉండేది. రీసెంట్ గా అఖండ, వీరి సింహారెడ్డితో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. నెక్ట్స్ రాబోతోన్న భగవంత్ కేసరి టీజర్ చూసిన తర్వాత మరో బిగ్ హిట్ గ్యారెంటీ అనిపించింది.

అందుకే బాబీతో చేయబోయే చిత్రానికి ఒకేసారి పది కోట్ల పారితోషికం పెరిగింది. అంటే ఇప్పుడు బాలయ్య రెమ్యూనరేషన్ 25కోట్లు అన్నమాట. బాబీ సినిమాతో ఫస్ట్ టైమ్ 25 కోట్లు తీసుకోబోతున్నాడు. పైగా ఈ చిత్రాన్ని కేవలం మూడు నెలల్లోగా పూర్తి చేయాలనే టాస్క్ కూడా ఉందట. సో.. ఇప్పుడు చిరంజీవి తర్వాతి స్థానంలో రెమ్యూనరేషన్ పరంగా బాలయ్యే ఆ తరం హీరోల నుంచి ఉన్నాడు.

వీరి బ్యాచ్ కే చెందిన వెంకటేష్‌, నాగార్జున మాత్రం ఇంకా 10 -12 కోట్ల మధ్యే ఆగిపోయారు. విశేషం ఏంటంటే.. వీరికంటే చాలా వెనక వచ్చిన రవితేజ, నాని వంటి వారు కూడా 20 వరకూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా బాలయ్య తన రేంజ్ కు తగ్గ రెమ్యూనరేషన్ కు ఎదిగాడు అనే చెప్పాలి.

Related Posts