చిరునవ్వులే తూటాలు -స్పై

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతోన్న సినిమా ”స్పై”. థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న ఈ చిత్రానికి గ్యారీ బిహెచ్ దర్శకుడు. మళయాలీ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేశాడు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పాడారు. కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ గీతం మంచి మెలోడియస్ గా ఉంది.


హీరోయిన్ తో ప్రేమలో పడిన హీరో ఆమె గురించిన ఆలోచనలతో మనసులో పాడుకున్నట్టుగా ఉందీ సాంగ్. మంచి సాహిత్యం కూడా కనిపిస్తోంది.


” ఈ యుద్ధంలో గెలుపెవరిది అననే.. సంకెళ్లు తీసిన ప్రేమదే కదే.. తూటాలే పేలుస్తుంటే నీ చిరునగవే.. అందాల గాయం తగిలే నా ఎదకే.. మౌనాల మరణమిదే” అనే పదాలు వినగానే ఆకట్టుకుంటున్నాయి. ఇదే పాటలో హీరోయిన్ సైతం హీరో మనసులోని భావాలను చదివినట్టుగా మొదటి చరణంలో వచ్చే సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది.


ఒకప్పుడు చిన్న సినిమాలకు పెద్ద ఎసెట్ గా నిలిచిన మ్యూజిక్ ఇచ్చిన విశాల్ భరద్వాజ్ ఈ పాటను సింపుల్ గా కంపోజ్ చేశాడు. ఆర్కెస్ట్రైజేషన్ బావుంది. సాహిత్యాన్ని డామినేట్ చేయకుండా ఇన్ స్ట్రుమెంట్స ను వాడిన విధానం చూస్తే తెలుగు పాట ఎంతగొప్పగా ఉంటుందో మరోసారి అర్థం అవుతుంది. మొత్తంగా ఈ తరహా స్పైథ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి పాటలు మంచి బ్రీజీగా ఉంటాయి. ఆ ఫీల్ నే ఈ పాట ఇస్తోంది. ఇక ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతోంది.

Related Posts