ఫైనల్ గా డేట్ పట్టేశాడు..

ఆర్ఎక్స్ 100తో ఫేమ్ అయిన హీరో కార్తికేయ. అంతకు ముందు ఓ సినిమా చేసినా అప్పుడెవరూ పట్టించుకోలేదు. ఆర్ఎక్స్ 100లోని బోల్డ్ అండ్ రా కంటెంట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఏకంగా హీరోయిన్ నే విలన్ గా చూపించాడు. ఇది పూర్తిగా కొత్త కంటెంట్ కావడంతో కాసుల వర్షం కురిసింది. హీరోగా కార్తికేయకు తిరుగులేని ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ ను కంటిన్యూ చేసేలా తర్వాత మరో సాలిడ్ హిట్ పడలేదు. ఒకట్రెండు సినిమాలు కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నా.. పెద్ద హిట్స్ అయితే కాదు. మధ్యలో నాని గ్యాంగ్ లీడర్ తో తెలుగులో, వలిమైలో అజిత్ కు విలన్ గా తమిళ్ లో నటించాడు. ఇవి కూడా పెద్దగా కలిసి రాలేదు. ఇక కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు బెదురులంక 2012 అనే సినిమాతో రాబోతున్నాడు.


డిజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ షూటింగ్ అయిపోయి ఎప్పుడో ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కానీ సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. లేదా రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు అనుకోవచ్చు. ఈ కారణంగానే ఎప్పుడో పూర్తయిన ఈ చిత్రం ఇప్పటి వరకూ ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. ఫైనల్ గా బెదురులంకకు ఓ కదలిక వచ్చింది. ఏకంగా రిలీజ్ డేట్ నే అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అంటూ అఫీషియల్ గా ప్రకటించారు.


2012లో ప్రపంచం అంతం అయిపోతుందనే ఓ గాలివార్త ప్రపంచవ్యాప్తంగా వచ్చిది కదా..? దాని ఆధారంగా ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ చిత్రం రూపొందింది. క్లాక్స్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ విషయం తేలక ఇప్పటి వరకూ కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు కూడా చెప్పడం లేదు కార్తికేయ. ఫైనల్ గా ఓ రిలీజ్ డేట్ పట్టేశారు కాబట్టి.. ఇక పాటలు, మరికొన్ని టీజర్ కట్స్, ప్రమోషన్స్ అంటూ సందడి మొదలవుతుందన్నమాట.

Related Posts