ఆగస్ట్ లో ఆదికేశవ్

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయినా.. ఆ ఫేమ్ ను కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్.

చిరంజీవి మేనల్లుడుగా, సాయితేజ్ తమ్ముడుగా వచ్చిన వైష్ణవ్ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడు. బట్ ఆ తర్వాత చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా చిత్రాలు పోయాయి.

ప్రస్తుతం ఆదికేశవ్ అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మోస్ట్ టాలెంటెడ్ మళయాలీ యాక్టర్ జోజూ జార్జ్ విలన్ గా నటిస్తుండటం విశేషం.

ఇక తమిళ్ లో డాడా సినిమాతో ఫేమ్ అయిన అపర్ణాదాస్, సదా ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి జివి ప్రకాష్‌ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన వీడియోతో పాటు శ్రీ లీల బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఆగస్ట్ 11న మెగాస్టార్ భోళా శంకర్ ఉంది. ఆ తర్వాత వారం అల్లుడు రాబోతున్నాడు. ఆదికేశవతో పాటు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన పెదకాపు -1 కూడా ఆగస్ట్ 18నే విడుదల కాబోతోంది.

Related Posts