బెదురులంక 2012 మూవీ డేరింగ్ స్టెప్

ఏ సినిమా మేకర్స్ కు అయినా తమ ప్రాజెక్ట్ పైనా, అవుట్ పుట్ పైనా చాలా నమ్మకమే ఉంటుంది. ఆ నమ్మకం నిజమా కాదా అనేది మొదటి ఆటకే తెలిసిపోతుంది. ఆ ఆట పడే వరకూ సినిమా తీసిన వారి హార్ట్ బీట్ పెరుగుతూనే ఉంటుంది. రిజల్ట్ తెలిసిన తర్వాత కూడా ఆ బీట్ లో రకరకాల మార్పులు ఉంటాయి.

అయితే కొంతమంది మాత్రం తమ సినిమా మొదటి ఆట వరకూ ఆగరు. ముందస్తుగానే కొన్ని ఆటలు చూపించాలనుకుంటున్నారు. ఓ రకంగా ఇది తమ నమ్మకంతో ఆటాడుకోవడమే. అంటే ప్రీమియర్స్ అన్నమాట. ఈ మధ్య ఈ పెయిడ్ ప్రీమియర్స్ కు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కూడా.

సామజవరగమనా, బేబీ, సార్, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిత్రాలు పెయిడ్ ప్రీమియర్స్ తోనే వచ్చిన మౌత్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. సార్, సామజవరగమనా సినిమాలైతే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. అయితే ఈ టాక్ ను రిలీజ్ డే కంటే ముందే వినడం వల్ల ఆ టాక్ ఆడియన్స్ కు కూడా ముందే తెలుస్తుంది. అప్పుడే ఓపెనింగ్స్ పెరుగుతాయి. అందుకే బెదురులంక2012 మూవీ టీమ్ కూడా ఈ పెయిడ్ ప్రీమియర్స్ ను ప్లాన్ చేసుకుంది. ఓ రకంగా వీరిది డేరింగ్ స్టెప్ అనాలి.


బెదురులంక హీరో కార్తికేయకు ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. ఆర్ఎక్స్ 100 తర్వాత ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాలు పోతుండటం వల్ల ఆ ఓపెనింగ్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. అందుకే ఈ మూవీ చాలా కీలకం అయింది. డిజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఇప్పటి వరకూ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.

పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపించింది. ఈ నమ్మకమే వీరిని పెయిడ్ ప్రీమియర్స్ వైపుకు తీసుకువెళ్లాయి అనుకోవచ్చు. మరి వీరి డేరింగ్ స్టెప్ మంచి రిజల్ట్ ఇస్తుందేమో చూడాలి.

Related Posts