ఏ ఆర్టిస్ట్ కైనా ఎక్కువ సినిమాల చేయాలి అనే తాపత్రయం ఉంటుంది. అదే సమయంలో తమదైన ముద్ర ఉండాలని కూడా కోరుకుంటారు. ఈ రెండు విషయాల్లోనూ సూపర్ సక్సెస్ అవుతోంది వరలక్ష్మి శరత్ కుమార్.
తమిళ్ లో కెరీర్ మొదలుపెట్టిన వరలక్ష్మి మెల్లగా సౌత్ మొత్తం విస్తరించింది. పోడాపోడి అనే తమిళ్ మూవీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది తను. ఆతర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానే నటించింది. అదే టైమ్ లో హీరో విశాల్ తో ప్రేమకథ కూడా వినిపించింది. ఇద్దరూ పెళ్లి వరకూ వెళ్లారు. కానీ విడిపోయారు.
ఆ తర్వాత తను మరింత దూకుడు పెంచింది. ఏ పాత్రైనా చేసుకుంటూ వెళ్లింది.ఈ క్రమంలో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ నుంచి విలన్ పాత్రల వరకూ అదరగొడుతూ వస్తోంది. తెలుగులో క్రాక్ మూవీలో తను చూపించిన విలనీకి చాలామంది ఫిదా అయిపోయారు.
ఆ తర్వాత వెంటనే నాంది మూవీలో సిన్సియర్ లాయర్ గానూ అదరగొట్టింది. ఇక నందమూరి బాలకృష్ణతో నటించిన వీరసింహారెడ్డి మూవీలో ఆమె నటన, పాత్ర నెక్ట్స్ లెవల్ అంటే అతిశయోక్తి కాదు. బాలయ్యతో పోటీ పడి మరీ నటించింది.
ఇక తాజాగా తను 50 సినిమాలు పూర్తి చేసుకుంది.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత పెద్ద జర్నీని తను ఎక్స్ పెక్ట్ చేయలేదని రాసుకుంది. ఈ ప్రయాణంలో సహకరించిన, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా తన టీమ్ పై ప్రశంసలు కురిపించింది. ఇకపై ఇదే తన ప్రపంచంగా.. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చేస్తా అని రాసుకుంది.
మొత్తంగా ఈ మధ్య కాలంలో హీరోయిన్లు పది ఇరవై సినిమాలు చేయడమే గగనంగా మారింది. అలాంటిది విభిన్న పాత్రలతో ఇన్ని సినిమాల్లో నటించడం విశేషమే. ఇక తను ఎంచుకు్న్న రూట్ ను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో డబుల్ సెంచరీ ఈజీగా కొట్టేస్తుందనుకోవచ్చు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వరూకి మనమూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం