నాలుగు నెలల తర్వాత ట్రాఫిక్ జామ్ ఉండదు – బండ్ల గణేష్

చిన్న చిన్న పాత్రలతో తెలుగు తెరకు పరిచయమై.. కమెడియన్ ఆకట్టుకున్నాడు బండ్ల గణేష్. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. భారీ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. రవితేజ, పవన్ కళ్యాణ్‌, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ తో సినిమాలు తీసి హిట్స్ అందుకున్నాడు గణేష్.

కొన్నాళ్ల క్రితం పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గత ఎన్నికలకు ముందు చాలా హడావిడీ చేశాడు. మంచి విమర్శలు చేశాడు.అతని పొలిటికల్ స్పీచ్ ల్లో ఓ క్లారిటీ ఉంటుంది. చూడ్డానికి కమెడియన్ లా ఉన్నా.. బలమైన సబ్జెక్ట్ తోనే మాట్లాడతాడు. ఇక ఒకానొక సందర్భంలో మీడియా రెచ్చగొడితే రెచ్చిపోయి కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో కోసుకుంటా అన్నాడు. పార్టీ ఓడిపోయింది. అతను అభాసుపాలయ్యాడు.

తర్వాత కొన్ని రోజులకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నాడు. కట్ చేస్తే మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ సారి గెలుపు కోసం శ్రమిస్తా అంటూ రేవంత్ రెడ్డితో పాటు జాతీయ అధిస్టానాన్ని కూడా కలిశాడు.


ఇక గతంలోలాగా ఈసారి మరీ యాక్టివ్ గా కనిపించడం లేదు కానీ తాజాగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం బలే ఆకట్టుకుంటోంది. గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ లో ట్రాఫిక్ నరకం కనిపిస్తోంది. ముఖ్యంగా పాలకు ఓ గొప్పగా చెప్పుకునే ఐటి కారిడార్ లో ఐదు కిలోమీటర్లకు ఐదు గంటలు పడుతోంది. ఇప్పటికే నగరవాసులు ఈ విషయంపై రకరకాలుగా సోషల్ మీడియాలతో తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1681984833399017474?s=20

అయితే హైదరాబాద్ లోని ఐకియా నుంచి గచ్చిబౌలీ వెళ్లే దారిలో ఉన్న ట్రాఫిక్ వీడియోను షేర్ చేస్తూ బండ్ల గణేష్.. ” ఇది మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్.. నాలుగు నెలల తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తాం. ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు చూసుకుంటాం దయచేసి నాలుగు నెలలు భరించండి.. ” అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇంకా ఎన్నికలకు సంబంధించి ఏ హడావిడీ లేకుండానే నాలుగు నెలలు అని ఎలా అంటాడు. అంటే కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నాడు అనే మాట నిజమేనా అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్ ఓ రేంజ్ లో అభివృద్ధి అయిందని కూడా అతను చెప్పాడు. ఇప్పుడు అవి చూపించి ఈ ట్వీట్ కు కౌంటర్స్ వేస్తారేమో కానీ.. నిజంగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అనేది నరకంలో వేసే ఒక శిక్షలా ఉందంటే అతిశయోక్తి కాదు.. ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు.

Related Posts