టాలీవుడ్

రిలీజ్ కు ముందే రికార్డ్ సృష్టించబోతోన్న బాలయ్య సినిమా

నందమూరి బాలకృష్ణ అంటే రికార్డుల రారాజు. ఒకప్పుడు ఎన్నో సెన్సేషనల్ హిట్ ఇచ్చాడు. ఇప్పటికీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అఖండ, వీర నరసింహారెడ్డి అంటూ బ్యాట్ టు బ్యాక్ హిట్స తో జోష్ గా ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఇది బాలయ్యతో పాటు అనిల్ ఇమేజ్ కూ తగ్గట్టుగా ఉండే యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోంది. బాలకృష్ణ సరసన ఫస్ట్ టైమ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పెళ్లై, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ చేస్తోన్న సినిమా ఇది. అంటే తనకు ఇది రీ ఎంట్రీ అనుకోవచ్చు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల ఓ కీలక పాత్ర చేస్తోంది. కొన్నాళ్లుగా వినిపిస్తోన్న రూమర్స్ ను బట్టి శ్రీ లీల .. బాలయ్య కూతురుగా కనిపిస్తుందని టాక్.

మొత్తంగా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఇక ఈ నెల 10న బాలయ్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను వినూత్నంగా విడుదల చేయబోతోంది టీమ్.


బాలకృష్ణకు ఇది 108వ సినిమా. అందుకే ఈ మూవీ టైటిల్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్ ద్వారా ప్రదర్శించబోతున్నారట. ఇప్పటి వరకూ తెలుగు సినిమా హిస్టరీలో ఇలా ఇన్ని హోర్డింగ్స్ ద్వారా ఒక సినిమా టైటిల్ ను ఎవరూ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇదో రికార్డ్‌ గా చెబుతున్నారు మేకర్స్.

నిజమే.. ఒక టైటిల్ ను ఇలా అనౌన్స్ చేయడం ఫస్ట్ టైమే. బాలయ్య రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి టైటిల్ ను కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద అనౌన్స్ చేసి అక్కడే ప్రదర్శించారు. అలా ఈ సారి 108 హోర్డింగ్స్ తో అంటే బాలయ్య బర్త్ డేకు రెండు రోజులు ముందు నుంచే ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెడతారన్నమాట.

Telugu 70mm

Recent Posts

సొంత నిర్మాణంలో సమంత కొత్త సినిమా

తెలుగులో ఎక్కువ కాలంపాటు సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగించిన హీరోయిన్స్ లో సమంత ముందు వరుసలో నిలుస్తుంది. టాలీవుడ్,…

59 mins ago

Malvika Sharma

2 hours ago

‘Premikudu’ Compete With ‘Vakeel Saab’

Once upon a time cinema halls were the only means of entertainment. Films that were…

2 hours ago

‘వకీల్ సాబ్‘తో పోటీకి సిద్ధమవుతోన్న ‘ప్రేమికుడు‘

ఒకప్పుడైతే సినిమా హాళ్లు మాత్రమే వినోద సాధనాలుగా ఉండేవి. భారీ విజయాలు సాధించిన చిత్రాలను మళ్లీ రీ-రిలీజులు చేసేవారు. కొన్ని…

3 hours ago

Naga Vamsi who declared his support for Pawan Kalyan

Support for Janasena chief Pawan Kalyan is increasing from the film industry. Many big screen…

3 hours ago

పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన నాగవంశీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పవన్ కోసం పిఠాపురంలో ప్రత్యక్షంగా…

3 hours ago