టాలీవుడ్

రికార్డ్ థియేటర్స్ లో బాలయ్య సినిమా

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ”నరసింహ నాయుడు”. 2001 సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఆ టైమ్ కుఉన్న టాలీవుడ్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసింది. ఎన్నో కొత్త రికార్డులనూ క్రియేట్ చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు రాబోతోంది. అది కూడా రికార్డ్ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా నరసింహ నాయుడు చిత్రాన్ని నేటి టెక్నాలజీకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ లోనూ రికార్డ్ ను క్రియేట్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ రేంజ్ లో ఒక సినిమాను రీ రిలీజ్ చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి. మరి బాలయ్య మూవీ అంటే ఆ మాత్రం రేంజ్ కనిపించాలి కదా అనేది ఫ్యాన్స్ వెర్షన్.


చిన్ని కృష్ణ కథ అందించిన ఈ చిత్రంలో బాలయ్య సరసన సిమ్రన్, ప్రీతి జింగానియా, ఆశాశైనీ హీరోయిన్లుగా నటించారు. మణిరత్నం పాటలు, నేపథ్య సంగీతం థియేటర్స్ ను ఓ ఊపు ఊపేశాయి.
నరసింహనాయుడు బాలకృష్ణ, బి. గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి చిత్రాలు అవి. ఈ మూడూ కూడా ఆ టైమ్ కు బాక్సాఫీస్ ను షేక్ చేసినవే కావడం విశేషం. నాలుగో సినిమాగా వచ్చిన నరసింహ నాయుడు మాత్రం ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది.

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలోని డైలాగ్స్ కూడా అదిరిపోతాయి. మరో విశేషం ఏంటంటే..ఈ మూవీతో పాటు వచ్చిన మెగాస్టార్ మృగరాజు డిజాస్టర్ అయింది. వెంకటేష్‌ దేవీ పుత్రుడు మాత్రం అబౌ యావరేజ్ గా నిలిచింది. అంటే ఆ సంక్రాంతి బాలయ్యదే అన్నమాట. అలాంటి సినిమాను బాలయ్య బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ మరింత ఖుషీగా ఫీలవుతున్నారు.

Telugu 70mm

Recent Posts

Pragya Jaiswal

8 hours ago

Honey Rose

8 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

8 hours ago

Nabha Natesh

9 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

9 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

9 hours ago