టాలీవుడ్

దసరా బరిపై బాలయ్య, చరణ్ గురి..!

జూన్ 27న ‘కల్కి’తో మొదలయ్యే బాక్సాఫీస్ ప్రభంజనం.. ఏడాది చివరిలో క్రిస్మస్ వరకూ అప్రతిహతంగా కొనసాగబోతుంది. దాదాపు ఆరు నెలల పాటు వరుసగా బాక్సాఫీస్ కి పెద్ద సినిమాలు పోటెత్తబోతున్నాయి. అయితే.. గడిచిన వారం రోజులుగా ఈ లిస్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు ముఖ్య కారణం.. ఎన్టీఆర్ ‘దేవర’ ప్రీపోన్ అవ్వడం.. అల్లు అర్జున్ ‘పుష్ప2’ పోస్ట్ పోన్ అవ్వడం.

ఒకసారి జూన్ 27 నుంచి వచ్చే క్రిస్మస్ వరకూ రాబోయే సినిమాల సంగతి చూస్తే.. ముందుగా ఈనెలలోనే ‘కల్కి’ ఆడియన్స్ ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక.. జూలై 12న కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ విడుదలకు ముస్తాబవుతోంది. పేరుకు అనువాదమైనా.. ‘భారతీయుడు 2’పై ఓ స్ట్రెయిట్ మూవీకి ఉన్నన్ని అంచనాలున్నాయి. అందుకు ప్రధాన కారణం.. గతంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించడమే.

జూలై లోనే మరో అనువాద సినిమా ‘రాయన్’ కూడా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది. విలక్షణ నటుడు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్‌ జయరామ్‌, ఎస్.జె.సూర్య, సెల్వ రాఘవన్, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ‘రాయన్’ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

జూలైలో అనువాద బొమ్మలు సందడి చేయనుండగా.. ఆగస్టులో మాత్రం తెలుగు నుంచి పలు క్రేజీ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘డబుల్ ఇస్మార్ట్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ రామ్ సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి భాగానికి సంగీతాన్ని సమకూర్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. ఇప్పుడు సీక్వెల్ కి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. ‘పుష్ప 2’ పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతుంది.

ఎక్కువగా పక్కింటబ్బాయి తరహా పాత్రలతో మెప్పించే నేచురల్ స్టార్ నాని.. ఈసారి ‘సరిపోదా శనివారం’ కోసం ఊరమాస్ అవతార్ లోకి మారాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ‘దసరా, హాయ్ నాన్న’ వంటి వరుస విజయాలతో ఉన్న నానికి.. ‘సరిపోదా శనివారం’ మరో హిట్ అందించడం ఖాయమనే సంకేతాలు.. ఈ సినిమా ప్రచార చిత్రాలతో అందుతున్నాయి. ఈ మూవీలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా.. విలన్ గా ఎస్.జె.సూర్య సందడి చేయబోతున్నాడు.

సెప్టెంబర్ విషయానికొస్తే.. ముందుగా తమిళం నుంచి విజయ్ నటిస్తున్న ‘ది గోట్’ రాబోతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో మురిపించబోతున్నాడు తమిళ దళపతి. ఇక.. సెప్టెంబర్ లో రానున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమాలో తారక్ నెవర్ బిఫోర్ పవర్‌ఫుల్ రోల్ లో కనువిందు చేయనున్నాడట. ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కొరటాల శివ.. చాలా కసితో ‘దేవర’ తెరకెక్కిస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. అసలు అక్టోబర్ లో రావాల్సిన ‘దేవర’.. సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయ్యింది.

సెప్టెంబర్ లోనే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రావాల్సి ఉంది. కానీ.. ఈ సినిమా వాయిదా పడిందనే ప్రచారం ఉంది. అలాగే.. ‘దేవర’ ఖరారు చేసుకున్న తేదీకే దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కూడా ఉంది. అయితే.. ‘లక్కీ భాస్కర్’ ఇంకా ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి..

‘దేవర’ సెప్టెంబర్ కి వెళ్లిపోవడంతో.. అక్టోబర్ లో దసరా కానుకగా ఒక్క రజనీకాంత్ ‘వెట్టైయాన్’ మాత్రం విడుదలకు ఉంది. తెలుగు నుంచి ఇంకా పెద్ద సినిమాలేవీ దసరా బరిలో బెర్తులు ఖరారు చేసుకోలేదు. అయితే.. బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్.బి.కె.109’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు దసరా స్లాట్ పై కన్నేశాయనే ప్రచారం ఉంది. త్వరలోనే.. ఈ రెండు సినిమాలకు సంబంధించి విడుదల తేదీలు ఖరారు చేయనున్నారట.

నవంబర్ లోనూ ఇప్పటివరకూ తెలుగు నుంచి ఏ సినిమా విడుదల తేదీ కన్ఫమ్ చేసుకోలేదు. అయితే.. డిసెంబర్ లో మాత్రం కాంపిటేషన్ భారీగానే ఉండబోతుంది. డిసెంబర్ మొదటివారంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూడో వారంలో క్రిస్మస్ కానుకగా నితిన్ ‘రాబిన్‌హుడ్’, నాగచైతన్య ‘తండేల్’ సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.

TELUGU70MM TEAM

Recent Posts

Pragya Jaiswal

3 hours ago

Honey Rose

3 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

4 hours ago

Nabha Natesh

4 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

5 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

5 hours ago