నందమూరి బాలకృష్ణ మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 108వ సినిమా చేస్తున్నాడు. భగవంత్ కేసరి అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ ను ఆయన బర్త్ డే స్పెషల్ గా విడుదల చేశారు. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అంతా మరో బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయారు.
ఇక ఆశ్చర్యంగా ఇదే రోజు తన 109వ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు బాలయ్య. చాలామంది బోయపాటితో ఉంటుంది అనుకుంటే కొంతమంది ఊహించినట్టుగానే దర్శకుడు బాబీతో సినిమా చేస్తున్నాడు బాలయ్య. బాబీ రీసెంట్ గా మెగాస్టార్ తో వాల్తేర్ వీరయ్య మూవీ చేశాడు. ఈ చిత్రం ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. హీరోల మాస్ పల్స్ ను పట్టుకుని సినిమాలు చేయడంలో బాబీ ఎక్స్ పర్ట్.
ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ కంప్లీట్ గా బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని లోగో లో చెప్పిన క్యాప్షన్ తో అర్థమవుతోంది. ”The world knows him.. But No one knows his World” అనే క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
అంటే ప్రపంచానికి అతను తెలుసు. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు అని అర్థం. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని 2024 ఆరంభంలోనే విడుదల చేస్తాం అని కూడా చెప్పారు. అంటే సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనుకోవచ్చు. మరి మెగాస్టార్ ను వింటేజ్ లుక్ లో చూపించి బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ.. నటసింహాన్ని ఎలా చూపిస్తాడు అనేది అందరిలోనూ ఆసక్తిగా ఉంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…