టాలీవుడ్

రెండో పాటలతో రెడీ అవుతోన్న బడా మూవీస్

ఈ ఏడాది ద్వితియార్థంలో టాలీవుడ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీస్ సందడి మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు క్యూ కడుతోన్న బడా మూవీస్ ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్. ఈకోవలోనే.. ఒక్కొక్కటిగా పాటలను విడుదల చేస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పటికే మొదటి పాటలను విడుదల చేశాయి ‘గేమ్ ఛేంజర్, దేవర, పుష్ప 2, భారతీయుడు 2’ వంటి చిత్రాలు. ఇప్పుడు ఈ చిత్రాల నుంచి సెకండ్ సింగిల్స్ కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

‘పుష్ప 2’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రష్మిక, బన్నీ కాంబోలో ఓ రొమాంటిక్ డ్యూయెట్ రాబోతుంది. మే 29న ‘పుష్ప 2’ రెండో పాటకు టైమ్ ఫిక్స్ అయ్యింది. ఇక.. ‘దేవర’ నుంచి కూడా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండో గీతంగా ఓ మెలోడియస్ సాంగ్ ను వదలబోతున్నారట. ‘గేమ్ ఛేంజర్’ రెండో పాట గురించి సమాచారం లేకపోయినా.. త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక.. ఇప్పటివరకూ విడుదలైన పాటల్లో ‘పుష్ప 2’కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆ తర్వాతి స్థానాల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ స్టార్స్ నటించిన ‘దేవర, గేమ్ ఛేంజర్’ సినిమాలున్నాయి. ఇక.. ఈ సినిమాలు ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ చేసి.. సెకండ్ సాంగ్స్ ను వదలడానికి సిద్ధమవుతుంటే.. ప్రభాస్ ‘కల్కి’, పవన్ ‘ఓజీ’ నుంచి ఫస్ట్ సింగిల్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

telugu70mm team

Recent Posts

‘Kalki’ Part-2 Shooting Half Completed

It is known that 'Kalki 2' is going to be the sequel of 'Kalki'. Even…

1 hour ago

‘కల్కి’ పార్ట్-2 అప్పుడే సగం పూర్తయ్యింది

'కల్కి' చిత్రానికి సీక్వెల్ గా 'కల్కి 2' రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సీక్వెల్ గురించి…

4 hours ago

Kollywood Superstar showered praises on ‘Kalki’

The movie 'Kalki' is getting tremendous response from the audience all over the world. Not…

5 hours ago

‘కల్కి’ని పొగడ్తలతో ముంచెత్తిన కోలీవుడ్ సూపర్‌స్టార్

'కల్కి' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ దక్కుతోంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం…

5 hours ago

Mirnaa

5 hours ago

‘kalki’ creating records in Overseas collections.

For Telugu movies, Andhra, ceded, Nizam and Karnataka were the main areas in the past.…

6 hours ago