బేబీ ట్రైలర్.. ఇలాంటి కథ చరితలో ఉండదంట

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ. కొన్నాళ్లుగా ఈ మూవీ పాటలు, టీజర్ తో చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఇంతకు ముందు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట అంటూ కామెడీ సినిమాలు తీసిన సాయి రాజేష్‌ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఎస్కేఎన్ నిర్మాత.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఊహించినట్టుగానే ఇది కూడా చాలా బావుంది అనే చెప్పాలి.
తొలిప్రేమ తాలూకూ జ్ఞాపకాలు ఏ మనిషినీ ఎన్నటికీ వదిలి వెళ్లవు. తొలి ప్రేమ జ్ఙాపకం అయిందీ అంటే సక్సెస్ కాలేదు అనే కదా అర్థం. అలా టీనేజ్ లోనే ప్రేమించుకున్న ఓ జంట నుంచి అమ్మాయి పై చదువులకు వెళ్లిపోయి.. అక్కడి ఆకర్షణలకు లొంగిపోతే.. ఆమెను ప్రేమించిన కుర్రాడి హృదయవేదన అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ పెయిన్ నే ఎలివేట్ చేసేలా ఉంది ఈ బేబీ సినిమా కథ.

ట్రైలర్ ఆరంభంలోనే .. ” మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది.. ” అనే కొటేషన్ ఉంటుంది. అంటే ఫస్ట్ లవ్ ఎప్పుడూ బెస్టే అనేది అందరికీ తెలుసు. అందుకే ఇది అందరి కథగా ఆడియన్స్ ముందుకు వస్తోంది అనుకోవచ్చు.


ఆనంద్, వైష్ణవి టెన్త్ క్లాస్ వరకూ కలిసి చదువుకుంటారు. ఆనంద్ టెన్త్ ఫెయిల్ అవుతాడు. అందరూ వేరు నేను వేరు అని కాన్ఫిడెంట్ గా చెప్పే వైష్ణవి పై చదువులకు వెళుతుంది. అక్కడ ఓ కుర్రాడు పరిచయమవుతాడు. సిటీలోని అమ్మాయిల తళుకులు చూసి తనూ మారుతుంది. అప్పటి నుంచి అప్పటివరకూ బాయ్ ఫ్రెండ్ లా ఉన్న ఆనంద్ ను కేవలం ఫ్రెండ్ గానే చూస్తుంది. అటు కాలేజ్ అబ్బాయికీ అదే చెబుతుంది. ఇదే సినిమాలోని ప్రధానమైన కాన్ ఫ్లిక్ట్ గా కనిపిస్తోంది.

ఈ కాన్ ఫ్లిక్ట్ కు కనెక్ట్ కాని ప్రేమకథ ఉండదు అనే చెప్పాలి. ఇక ” తిరిగి కొట్టేంత బలం లేదనేగదరా ఈ కొవ్వు. నీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగ ఇంకెవ్వడు కొట్టలేడు.. “అంటూ ట్రైలర్ చివర్లో వైష్ణవి చెప్పిన డైలాగ్ ప్రతి అబ్బాయికీ నచ్చుతుంది..


మొత్తంగా ప్రేమలో పడిన, ఓడిన, గెలిచిన ప్రతి ఒక్కరి హృదయ వేదనను మరోసారి తట్టిలేపబోతోన్న కథలా కనిపిస్తోంది ఈ బేబీ మూవీ. కాకపోతే ట్రైలర్ ఉన్నంత గొప్పగా సినిమా కూడా ఉండాలనేం లేదు. బట్ వీళ్లు ఆ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారనే ఆశిద్దాం.. అన్నట్టు ఈ బేబీ ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Related Posts