క్లాసిక్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో కొన్ని సినిమాలే ఉంటాయి. అవి అన్ని తరాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ప్రేమకథలోనే మంచి సందేశం ఉంటుంది. హృదయాలను ద్రవింప చేసే సెంటిమెంట్ తో పాటు అద్భుతమైన పాటలు అదనంగా కనిపిస్తాయి. అలా చూస్తే ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే సినిమా 7/జి బృందావన కాలనీ.

ఏఎమ్ రత్నం తన కొడుకు రవికృష్ణను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ఈఈ సినిమాలో.. సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అప్పటికే దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేశాడు. ఒకే కాలనీ నివసించే వేర్వేరు మతాలు, ప్రాంతాలకు చెందిన ఓ యువజంట మధ్య ప్రేమ పుట్టడం.. అప్పటి వరకూ ఆవారాగా ఉన్న ఆ కుర్రాడిని ఓ బాధ్యతాయుతమైన మనిషిగా ప్రేమ మార్చడం.. అటుపై అనుకోని సంఘటనలతో ఆమె చనిపోవడం.. కుర్రాడు మతి స్థిమితం లేనివాడుగా మారిపోవడం వంటి సీక్వెన్స్ లతో పాటు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్, సాంగ్స్ హైలెట్ గా నిలిచిన ఈ సినిమా అప్పట్లో తెలుగుతో పాటు తమిళ్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.క్లాసిక్ లవ్ స్టోరీస్ జాబితాలో చోటు సంపాదించుకుంది.ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే రవికృష్ణ ఈ పాత్ర చేయడానికే పుట్టాడాఅన్నట్టుగా ఒదిగిపోయాడు. సోనియా అగర్వాల్ అద్బుతంగా సెట్ అయింది. చంద్రమోహన్ సెంటిమెంట్ సీన్ తో పాటు సుమన్ శెట్టి కామెడీతో పాటు ఫ్రెండ్షిప్ హైలెట్ గా ఉంటుంది.


2014లో విడుదలైన ఈ మూవీని రీ రిలీజ్ చేస్తాం అని గతంలోనే ప్రకటించాడు ఏఎమ్ రత్నం. అన్నట్టుగానే ఈ సెప్టెంబర్ 22న తమ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. నిజానికి ఈ నెలలోనే వస్తుందనుకున్నారు చాలామంది. వీళ్లు మాత్రం నెల తర్వాత విడుదలకు ప్లాన్ చేసుకున్నారు.ఈ మూవీ ఎప్పుడు టివిల్లో వచ్చినా జనం చూస్తున్నారు.ఈ మూవీ ఈ జెనరేషన్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మరోసారి పెద్ద హిట్ అయినా ఆశ్చర్యం లేదు.

Related Posts