ఆకట్టుకుంటున్న ‘అయలాన్‘ టీజర్

తెలుగులోనూ మంచి స్టార్ డమ్ ఉన్న తమిళ నటుల్లో శివకార్తికేయన్ ఒకడు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన శివకార్తికేయన్ ప్రస్తుతం తమిళనాట మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నాడు. శివకార్తికేయన్ నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో అలరించాయి. ‘మహావీరుడు‘ వంటి మంచి విజయం తర్వాత శివకార్తికేయన్ ‘అయలాన్‘ సినిమాతో వస్తున్నాడు.

ఏలియన్ కాన్సెప్ట్ తో వైవిధ్యంగా ‘అయలాన్‘ రూపొందుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆర్.రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. గతంలో శివకార్తికేయన్ తో ‘రెమో, వేళైకారన్, సీమరాజా‘ వంటి సినిమాలను నిర్మించిన ఆర్.డి.రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘అయలాన్‘ విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ పల్లెటూరిలో త‌న ఫ్రెండ్స్ తో ఉండే శివకార్తికేయన్‌ కు.. అనుకోకుండా ఆ ఊరిలోకి వచ్చిన ఏలియన్‌ తో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఊరికి ఒక స‌మ‌స్య రాగా ఏలియన్‌ తో క‌లిసి శివకార్తికేయన్ ఆ స‌మ‌స్య ను ఎలా పరిష్కరించాడు అనేది ఈ మూవీ స్టోరీ గా టీజర్ ను బట్టి తెలుస్తోంది.

టీజర్ అయితే హాలీవుడ్ స్టాండార్డ్స్ లో కనిపిస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్, నిరవ్ షా సినిమాటోగ్రఫీ ‘అయలాన్‘కి టెక్నికల్ గా మంచి ప్లస్ కానున్నాయి. మొత్తంమీద పొంగల్ రేసులో కోలీవుడ్ నుంచి వస్తోన్న ‘అయలాన్‘ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related Posts