మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మెగా ఇంట పెళ్లి సందడి అంటే మామూలుగా ఉంటుందా? మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఒక్క చోట చేరే ఆ వేడుక అంగరంగ వైభవంగా ఉంటుంది. తాజాగా వరుణ్-లావణ్య పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆఫ్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి, నాగబాబు దంపతులతో పాటు రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ సందడి చేశారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తప్ప అందరు మెగా హీరోస్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

వరుణ్ తేజ్ -లావణ్య నిశ్చితార్థం జూన్ లో జరిగింది. వీరి పెళ్లి అక్టోబర్ 17న జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరి వివాహం జరగనుందట.