బ్రో పై బేబీ డామినేషన్

పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ నటించిన బ్రో సినిమాపై ముందు నుంచీ పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కొంత హైప్ వచ్చినా.. రెగ్యులర్ పవన్ కళ్యాణ్‌ సినిమాలకు కనిపించే హడావిడీ ఈ చిత్రానికి కనిపించలేదు అనేది నిజం. మేనల్లుడుతో కలిసి నటించాడు అనే ట్యాగ్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా రిలీజ్ డే రోజు కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. ఏకంగా 50 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

బట్ నెక్ట్స్ డే ఆ ఉత్సాహం కనిపించలేదు అనేది నిజం. ఖచ్చితంగా చెబితే శనివారం అందులో సగం మాత్రమే వసూళ్లు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీలో కొందరు దర్శకులను తెచ్చి సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా వర్కవుట్ కాలేదు. సండే సైతం సాధారణంగానే ఉంది. ఇక హిట్ సినిమాలకు కూడా వీక్ డేస్ టెస్ట్ ఉంటుంది. సోమవారం కూడా సత్తా చాటితేనే ఆ సినిమాలో కంటెంట్ ఉన్నట్టు లెక్క. ఆ విషయంలో బ్రో.. తేలిపోయాడు. మండే టెస్ట్ లో బ్రో ఫెయిల్ అయింది. కలెక్సన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.


విశేషం ఏంటంటే.. విడుదలై మూడు వారాలవుతున్నా.. ఇప్పటికీ బేబీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. సోమవారం రోజు బ్రో కంటే బేబీ థియేటర్స్ లోనే ఎక్కువ జనం కనిపించారు అనేది ట్రేడ్ టాక్. ఇప్పటికే ఆ సినిమా 80 కోట్లు దాటేసింది. ఈ ఊపు చూస్తోంటే ఈజీగా సెంచరీ కొడుతుందని చెప్పొచ్చు. మరోవైపు వంద కోట్ల షేక్ టార్గెట్ తో వచ్చిన బ్రో బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకూ తేలిపోతుంది. ఈ సినిమాలో విషయం ఉంది. కానీ దాన్ని చెప్పే విధానంలోనే అనేక లోపాలున్నాయి.

వింటేజ్ పవన్ కళ్యాణ్‌ ను చూపించాం అన్నారు. కానీ అతని పాటలను అతనే డ్యాన్స్ వేసుకోవడం.. అభిమానులకు కూడా నచ్చలేదు. మరోవైపు టైమ్ వాల్యూ చెబుతున్నా అనే కాన్సెప్ట్ అనేక చోట్ల ల్యాగ్ అనిపించుకుంది. పైగా �