కమెడియన్ గా పదేళ్ల పాటు సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సునీల్.. కథానాయకుడిగా ఫిక్సైన తర్వాత.. దాదాపు దశాబ్ద కాలంలో కేవలం పది సినిమాలు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు.. కమెడియన్ గా స్టార్ రేంజ్ కు చేరిన సునీల్ ను.. హీరో అనే ట్యాగ్ లైన్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈనేపథ్యంలో.. ఆలస్యంగానైనా తన తప్పు తెలుసుకుని మళ్లీ కామెడీ బాట పట్టాడు. అది కాస్తా ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ గా టర్న్ అయ్యేలా చేసింది.
‘పుష్ప’ ఇచ్చిన బూస్టప్ తో సునీల్ క్యారెక్టర్ యాక్టర్ గా మామూలు స్పీడు చూపించడం లేదు. ఒకవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అంతకు మించి అన్నట్టు తమిళ చిత్రాల్లో చెలరేగిపోతున్నాడు. ఇప్పుడు ఎంతలా తయారయ్యిందంటే చేసేది తెలుగు సినిమా అయినా అందులోనూ తమిళ పాత్రలే చేసేటంతగా.
లేటెస్ట్ గా సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమా నుంచి సునీల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో అతను పోషిస్తున్న పాత్ర పేరు పళని సామి. ఈ పేరు ఎక్కువగా తమిళ్ల వాళ్లే వాడుతుంటారు. ఈ మూవీలోని సునీల్ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. అతను తమిళ వాడుగానే నటిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో సస్పెండెడ్ పోలీస్ పాత్రలో సునీల్ కనిపించనున్నాడట. మొత్తంమీద.. ఆ మధ్య హైదరాబాద్ తన ఇల్లు అయితే.. తమిళ చిత్ర పరిశ్రమ తనకు దేవాలయం వంటిదని కోలీవుడ్ పై తన ప్రేమను కురిపించాడు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి.నాయుడు ‘హరోం హర’ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ రాబోతుంది.
The movie 'Arya' completed 20 years on May 7. On this occasion, the team specially…
'ఆర్య' సినిమా విడుదలై.. మే 7 తో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా.. ఆనాటి 'ఆర్య' అనుభవాలను ప్రత్యేకంగా…
Nikhil got a hit at pan India level with 'Karthikeya 2'. In a way, it…
Currently there is an election atmosphere across the country. Especially all the mega heroes have…
‘కార్తికేయ 2‘తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్నాడు నిఖిల్. ఒకవిధంగా ప్రెజెంట్ దేశవ్యాప్తంగా సాగుతోన్న డివోషనల్ ట్రెండ్…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారంలో స్పీడు పెంచారు.…