టాలీవుడ్ లో ఉన్న సీనియర్ మోస్ట్ బ్యూటీస్ లో స్వీటీ ఒకరు. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. తొలినాళ్లలో గ్లామర్ కి పనిచెబుతూ.. స్టార్ హీరోస్ తో ఆడిపాడి.. అనతి కాలంలోనే అగ్ర స్థానానికి ఎదిగింది.
‘అరుంధతి’తో ప్రత్యేకమైన గుర్తింపు
వరుసగా గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతున్న అనుష్క కెరీర్ ను ‘అరుంధతి’ చిత్రం మలుపుతిప్పింది. ఒకవైపు అగ్ర కథానాయకులతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు ప్రత్యేకంగా దృష్టి సారించింది.
‘అరుంధతి’ తర్వాత అనుష్క కెరీర్ లో ‘బాహుబలి’కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ‘బాహుబలి’తో అనుష్క క్రేజ్ నేషనల్ వైడ్ గా మారుమ్రోగింది. ఈ చిత్రంలో దేవసేనగా అనుష్క చూపించిన రాజసానికి యావత్ భారతదేశ సినీ అభిమానులు మైమరిచిపోయారు.
స్వీటీకి ‘సైజ్ జీరో’ షాక్
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎలాంటి సాహసమైన చేసేందుకు అనుష్క సిద్ధమవుతుంటోంది. ఈకోవలోనే.. మెరుపుతీగలా ఉండే స్వీటీ.. ‘సైజ్ జీరో’ కోసం భారీగా బరువు పెరిగింది. అయితే.. ‘సైజ్ జీరో’ కోసం వేగంగా బరువు పెరిగిన అనుష్క.. తగ్గడంలో మాత్రం నిర్లక్ష్యం వహించిందనే కామెంట్స్ ఉన్నాయి.
ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అనుష్క.. తన బరువును సహజ పద్ధతులలోనే తగ్గాలని నిర్ణయించుకోవడం కూడా ఆమె వెంటనే బరువు తగ్గలేకపోవడానికి కారణాలుగా చెబుతారు.
కథల ఎంపికలో విలక్షణత
గతంలో ఏడాదికి ఈజీగా మూడు, నాలుగు సినిమాలు చేసిన అనుష్క.. గడిచిన తొమ్మిదేళ్లలో కేవలం ‘బాహుబలి’ సిరీస్, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలు మాత్రమే చేసింది.
ఇంకా.. కొన్ని సినిమాలలో కేమియోస్ తో అలరించింది. అనుష్క ఎక్కువ సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం.. కథల ఎంపికలో విలక్షణతను చూపించడమే .
చిరంజీవితో సినిమా ఉందా?
అనుష్క ఇప్పటికే మలయాళంలో ఒక సినిమాకి కమిటైంది. మలయాళం స్టార్ జయసూర్య నటిస్తున్న ‘కథనార్‘ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. పీరియడ్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితోనూ నటించే ఆఫర్ అందుకుందట అనుష్క.
గతంలో చిరంజీవి ‘స్టాలిన్‘ మూవీలో ఒక పాటలో మెరిసిన అనుష్క.. ఆ తర్వాత ‘సైరా.. నరసింహారెడ్డి‘లో కేమియోతో మురిపించింది. ఇప్పుడు చిరంజీవి-వశిష్ట కాంబోలో రూపొందుతోన్న మెగా 156 లో అనుష్క ఒక నాయికగా నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది.
రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…
జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని…
ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…
ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…
Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…
Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…