వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా ను అందజేస్తుంది. పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, నటులు వంటి వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను ఇస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమ నుంచి కొంతమంది ప్రముఖులు ఈ వీసాను అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.
ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవికి ఇది మరో అరుదైన గౌరవం అని చెప్పొచ్చు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర‘ చిత్రం రూపొందుతోంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సోషియో ఫాంటసీగా ‘బింబిసార‘ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరుకి జోడీగా త్రిష నటిస్తుంది. ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర‘ విడుదలకు ముస్తాబవుతోంది.
ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా…
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'జై హనుమాన్' ఒకటి.…
'డార్లింగ్' ప్రభాస్ సినిమా టైటిల్ తో రూపొందుతోన్న ప్రియదర్శి చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్…
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…