డైరెక్టర్ గా మారుతున్న మరో కమెడియన్

కమెడియన్స్ హీరోలుగా మారుతోన్న ట్రెండ్ అనాది నుంచి ఇప్పటికీ జోరుగానే కొనసాగుతోంది. అయితే.. హీరోలుగానే కాదు కొంతమంది కమెడియన్స్ డైరెక్టర్స్ గానూ సత్తా చాటుతున్నారు. గతంలో పద్మనాభం వంటి కమెడియన్స్ డైరెక్టర్స్ గా మారి మంచి విజయాలందుకున్నారు. ఆ తర్వాత ఎ.వి.ఎస్., వెన్నెల కిషోర్ వంటి వారు ఈ ప్రయత్నం చేసినా పెద్దగా ఫలించలేదు.

కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారి సంచలన విజయాన్నందుకున్నాడు వేణు. ‘జబర్దస్త్’ వేణుగానే ఎక్కువ మందికి పరిచయమున్న ఈ కమెడియన్ ‘బలగం‘ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు. అంతేకాదు ‘బలగం‘ సినిమా జాతీయ, అంతర్జాతీయంగా పలు అవార్డులు కూడా అందుకుంది.

వేణు బాటలోనే మరో ‘జబర్దస్త్‘ కమెడియన్ ధన్ రాజ్ కూడా మెగాఫోన్ పట్టబోతున్నాడట. ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించిన ధన్ రాజ్ ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాలో నటించే హీరో మరెవరో కాదు విలక్షణ నటుడు సముద్రఖని.

‘విమానం‘ సినిమాలో సముద్రఖనితో పాటు ధన్ రాజ్ కూడా నటించాడు. ఆ సమయంలోనే సముద్రఖనికి ఓ ఫీల్ గుడ్ స్టోరీ వినిపించాడట ధన్ రాజ్.

ఆ సబ్జెక్ట్ నచ్చడంతో సినిమా చేయడానికి సముద్రఖని ఓ.కె. చెప్పాడట. దసరా నుంచే ధన్ రాజ్ డైరెక్ట్ చేసే మూవీ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ బైలింగ్వల్ గా ఈ చిత్రం తెరకెక్కనుందట.

Related Posts