డిసెంబర్ 8న నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‘

పెద్ద డైనోసార్ ‘సలార్‘ డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా వస్తుండడంతో.. ఆ సమయంలో విడుదల తేదీలు ఖరారు చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటించుకుంటున్నాయి. ఇప్పటికే డిసెంబర్ 22 నుంచి సంక్రాంతికి షిప్టైంది వెంకటేష్ ‘సైంధవ్‘ చిత్రం. ఇక.. లేటెస్ట్ గా డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 8 కి విడుదల తేదీ మార్చుకుంది నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‘.

డిసెంబర్ 8, 9 తేదీలలో పెద్ద కాంపిటేషనే ఉంది. ఇప్పటికే వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలైంటైన్‘, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘, ఆశిష్ రెడ్డి‘ సెల్ఫిష్‘ చిత్రాలు అప్పుడే రిలీజ్ డేట్స్ కన్ఫమ్ చేసుకున్నాయి. లేటెస్ట్ గా నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‘ డిసెంబర్ మొదటి వారం విడుదల లిస్టులో చేరింది.

రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఒకప్పుడు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన హరీష్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ ఎల్.ఎల్.పి, రుచిర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‘ సినిమాని నిర్మిస్తున్నాయి.

Related Posts