అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తో మ్యూజిక్ తోనే మీడియం రేంజ్ హీరో స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనిరుద్ రవిచందర్. కోలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు అతనికి తెలుగులోనూ తిరుగులేని డిమాండ్ ఉంది. ఎంత పెద్ద రెమ్యూనరేషన్ ఇచ్చినా.. మరో యేడాది వరకూ అతను ఖాళీగా లేడు. అంత బిజీగా ఉన్నాడు మరి.
రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా విజయంలో అతనిదే కీలక పాత్ర. రాబోతోన్న జవాన్ సినిమాకూ అదే రేంజ్ ఆర్ఆర్ ఇచ్చాడంటున్నారు. మరి సినిమాకు ఎసెట్ అవుతాడంటే ఏ దర్శక, నిర్మాత మాత్రం వదులుకుంటారు. అందుకే అతనికి అంత డిమాండ్. అతనూ అంత డిమాండ్ చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉన్న అనిరుద్ హీరోగా మారబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలు కావడం కోలీవుడ్ లో సాధారణమే. ఆల్రెడీ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం చేస్తూనే హీరోగానూ అదరగొడుతున్నాడు. ఆ మధ్య హిప్ హాప్ తమిళ అనే కుర్రాడు కూడా హీరో అయ్యాడు. ఆ రూట్ లోనే అనిరుద్ కూడా వెళ్లబోతున్నాడనేది కోలీవుడ్ నుంచి వినిపిస్తోన్న మాట.
హీరో కావడం మేటర్ కాదు కానీ.. ఈ మాటతో దర్శకుడి గురించీ వచ్చిన వార్తలే సెన్సేషనల్ గా మారాయి. యస్.. అనిరుద్ చేయబోయేది ఓ లవ్ స్టోరీ అట. ఆ చిత్రాన్ని మోస్ట్ టాలెంటెడ్ స్టార్ ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడు అనేదే ఆ వార్త.
ధనుష్ ఖాతాలోనే హీరోగా ఇప్పుడు ఆరు సినిమాలున్నాయి. ఇవన్నీ పూర్తి చేసేదెప్పుడు.. డైరెక్షన్ కూడా చేసేదెప్పుడూ.. అనే డౌట్ వస్తుంది కానీ ధనుష్ అనుకుంటే చేసేస్తాడు. ఆ విషయంలో అతనికి మంచి ప్రావీణ్యం ఉంది.
పైగా అనిరుద్ కెరీర్ ఆరంభంలో ధనుష్ కూడా బాగా ఎంకరేజ్ చేశాడు. మరి ఇది నిజమా కాదా అనేదానికంటే నిజమే అని నమ్ముతున్నవాళ్లే కోలీవుడ్ లో ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ కాంబినేషన్ లో సినిమా నిజంగానే వస్తుందంటారా..?
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…