జూన్ లో విడుదలకు ముస్తాబవుతోన్న ‘రాయన్’

ఈతరం యువ కథానాయకుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక నటుడు ధనుష్. కేవలం కథానాయకుడుగానే కాకుండా నిర్మాతగానూ, దర్శకుడిగానూ తన ప్రతిభ చాటుతూనే ఉంటాడు ధనుష్. ఇప్పటికే తన డైరెక్షన్ లో డెబ్యూ మూవీ ‘పవర్ పాండి’తో భారీ విజయాన్నందుకున్నాడు. ఇప్పుడు ‘రాయన్’ పేరుతో ఓన్ డైరెక్షన్ లో రెండో సినిమాని తీసుకొస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్‌ జయరామ్‌, ఎస్.జె.సూర్య, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ‘రాయన్’.. జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ‘రాయన్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో ఇటుకుల మీద కూర్చోన్న ధనుష్ లుక్ ఫైర్ లా ఉంది. అలాగే.. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో పది తలల రావణుడిని తలపించే ఫోటో కూడా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మే 9న రానుంది.

Related Posts