లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ లిల్లీ

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా గ్లామరస్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం అనుపమ కిట్టీలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి. వీటిలో మూడు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ కావడం విశేషం.

‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. అనుపమతో ‘ఆక్టోపస్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ మొదలుపెట్టాడు. ‘హనుమాన్’ తర్వాత ఈ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లింది. ఇటీవలే ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగులతో ‘పరదా’ అనే మూవీని అనౌన్స్ చేసింది అనుపమ. ‘పరదా’ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీనే.

ఇక.. లేటెస్ట్ గా లైకా ప్రొడక్షన్స్ లో ‘లాక్ డౌన్’ అనే సినిమా చేయబోతుంది. ఈ చిత్రానికి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది.

ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో తెరకెక్కనుందట. ఈ మూడు సినిమాలు కాకుండా.. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తున్న ‘బైసన్’లోనూ హీరోయిన్ గా నటిస్తుంది అనుపమ.

Related Posts