మహేష్ కు ఫస్ట్ టెస్ట్ పెట్టిన రాజమౌళి

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్స్ లో రాజమౌళి – మహేష్‌ బాబు ఒకటి. ఇరవైయేళ్లుగా ఈ కాంబినేషన్ లోఓ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకో ఈ కాంబో ఇప్పటి వరకూ సెట్ కాలేదు. ఫైనల్ గా ఇప్పుడు రాజమౌళి గ్లోబల్ స్టార్ డైరెక్టర్ గా మారిన తర్వాత మహేష్ టైమ్ వచ్చింది.

దీనివల్ల ఇప్పటి వరకూ కేవలం టాలీవుడ్ స్టార్ గానే ఉన్న మహేష్‌ కు ఒక్కసారిగా గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం అయ్యే ఛాన్స్ వచ్చింది. ఈ యేడాది చివర్లోనే ప్రారంభం అవుతుందీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నారు. కానీ నెక్ట్స్ ఇయర్ స్టార్ట్ అవుతుందట.

ఈ లోగా మహేష్‌ గుంటూరు కారం పూర్తి చేస్తాడు. మామూలుగా రాజమౌళి సినిమా అంటే ఏ హీరో అయినా ఒళ్లు హూనం కావాల్సిందే కదా. ఇప్పుడు మహేష్‌ వంతు వచ్చింది. ఇప్పటి వరకూ మహేష్‌ సినిమాలు మాస్ ను మెప్పించినా.. యాక్షన్ సీన్స్ ఉన్నా.. అవన్నీ చాలా సున్నితంగా ఉన్నట్టే కనిపిస్తాయి. బట్ జక్కన్న అంటే అట్టా ఉండదు కదా..


రాజమౌళి – మహేష్‌ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోందని ఇప్పటికే చెప్పారు. ఇదో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలోనే హింట్ ఇచ్చాడు. అమెజాన్ అడవుల నేపథ్యం కూడా ఉంటుందన్నాడు. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించనంత స్టైలిష్ యాక్షన్ డోస్ ఈ మూవీలో ఉంటుందట.

అందుకే ఈ మూవీ యాక్షన్ సీన్స్ కాస్త నేచురల్ గా ఉండేందుకు ఓ మూడు నెలల పాటు మహేష్‌ ను ట్రెయినింగ్ తీసుకొమ్మని చెప్పాడట రాజమౌళి. రాజమౌళి అంటే పర్ఫెక్షనిస్ట్ కదా. అందుకే ఈ ట్రెయినింగ్ సెసన్ ను కూడా తనే అరేంజ్ చేశాడట.

ఈ మేరకు ఈ యేడాది చివర్ లో నవంబర్, డిసెంబర్, జనవరి వరకూ మహేష్ ఆ స్పెషల్ ట్రెయినింగ్స్ అన్నీ పూర్తి చేయాలని అతనికి ఫస్ట్ టెస్ట్ పెట్టాడన్నమాట. ఈ టెస్ట్ లో మహేష్‌ పాస్ అయితే ఇక సెట్స్ పైకి వెళతారన్నమాట. అదీ మేటర్. సో.. ఈ సారి మహేష్ బాబుకు మినరల్ వాటర్ తో పొలంలో దిగినంత వీజీ కాదన్నమాట. .

Related Posts